»   » హీరో రామ్.... ‘ఉన్నది ఒకటే జిందగీ’?

హీరో రామ్.... ‘ఉన్నది ఒకటే జిందగీ’?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'నేను శైలజ' లాంటి హిట్ చిత్రాన్ని అందించిన కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి 'ఉన్నది ఒకటే జిందగీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

సగం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ ఊటీలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల 6 నుంచి ఊటీలో జరిగే ఈ షెడ్యూలులో కొన్ని సన్నివేశాలను, పాటలను చిత్రీకరించనున్నారు.

కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్‌. సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్‌ కథానాయికలు. ఉగాదికి ప్రారంభమైన ఈ చిత్రం 2017 చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రామ్ కొత్తగా

రామ్ కొత్తగా

గతేడాది రామ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘నేను శైలజ'లో రామ్‌ను దర్శకుడు సరికొత్తగా చూపించారు. ఇప్పుడీ కొత్త చిత్రంలోనూ రామ్‌ లుక్, బాడీ లాంగ్వేజ్‌లను సరికొత్తగా చూపించనున్నారు.

Hero Ram Stunning Beard Look Video Out | Filmibeat Telugu
రామ్‌కి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ

రామ్‌కి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ

నిర్మాత ‘స్రవంతి' రవికిశోర్‌ మాట్లాడుతూ - ‘‘రామ్‌ లుక్‌ దగ్గర్నుంచి సై్టల్‌ వరకూ ప్రతిదీ కొత్తగా ఉంటాయి. ‘నేను శైలజ' తర్వాత కిశోర్‌ తిరుమల మరోసారి రామ్‌కి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే మంచి కథ రెడీ చేశాడని తెలిపారు.

ప్రేక్షకులు ఆయా పాత్రల్లో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు

ప్రేక్షకులు ఆయా పాత్రల్లో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు

దర్శకుడు కిశోర్‌ తిరుమల మాట్లాడుతూ - ‘‘ఫ్రెష్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ లైవ్లీగా ఉంటుంది. ప్రేక్షకులు ఆయా పాత్రల్లో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. ‘నేను శైలజ' తర్వాత మా కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయి. వాటిని అందుకునేలా ఈ సినిమా ఉంటుంది'' అన్నారు.

తెర వెనక

తెర వెనక

యువ హీరో శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు' ఫేమ్‌ ప్రియదర్శి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాశ్, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సాహిత్యం: ‘సిరివెన్నెల' సీతారామశాస్త్రి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.​

English summary
Hero Ram next movie title 'Unnadi Okate Zindagi'. Kishore Tirumala is directing this film. It is known that Kishore Tirumala has delivered a super hit to Ram with 'Nenu Sailaja' in the past.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu