»   » అదే డైరెక్టర్ తో రామ్ సినిమా... ఈ సారి కండలు పెంచుతాడట

అదే డైరెక్టర్ తో రామ్ సినిమా... ఈ సారి కండలు పెంచుతాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను శైలజ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో రామ్ హైపర్ తరువాత మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. హైపర్ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ మీద కన్నేశాడు రామ్. అందుకే మరోసారి నేను శైలజ కాంబినేషన్ నే రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ముందు అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయాలని భావించినా.. ఇప్పుడే ప్రయోగం చేయటం ఇష్టం లేని రామ్ సేఫ్ గేమ్ కే మొగ్గుచూపుతున్నాడు.

హైపర్ తరువాత ఎలాంటి సినిమా చేయాలన్న ఆలోచనతో చాలా రోజులు పాటు సినిమాను ఎనౌన్స్ చేయకుండా కాలం గడిపేశాడు. ఈ గ్యాప్ లో కరుణాకరణ్, అనీల్ రావిపూడి లాంటి దర్శకులతో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించినా.. ఏది సెట్స్ మీదకు రాలేదు.

అయితే తాజాగా ఈ ఎనర్జిటిక్ హీరో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. నేను శైలజ లాంటి సినిమాతో తన కెరీర్ కు కిక్ ఇచ్చిన, కిశోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. నేను శైలజ తరువాత వెంకటేష్ హీరోగా ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు కిషోర్.

Hero Ram Pothineni To Team Up With Kishore Tirumala Once Again

ఆ సినిమా ఆగిపోవటంతో రామ్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాశాడు. దాంతో ఫైనల్ గా మరోసారి నేను శైలజ కాంబినేషన్ కే ఫిక్స్ అయ్యాడు రామ్. మరోసారి కిశోర్ తిరుమల దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రారంభించనున్నారు.

రామ్ కండలు తిరిగిన దేహంతో కనిపించనున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేను శైలజ సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి అదే కాంబినేషన్ లో పనిచేస్తున్నాడు. రామ్ హోం బ్యానర్ స్రవంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

English summary
Actor Ram, who was last seen in Hyper, is teaming up once again with director Tirumala Kishore. Buzz is that Kishore has completed a hardbound script for Ram
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu