twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిన్న బాలకృష్ణ ...ఇప్పుడు హీరో రామ్ (ఫొటో)

    By Srikanya
    |

    హైదరాబాద్: నూతన సంవత్సరం వేడుకలకు అంతా సిద్దమవుతున్నారు. అభిమానులు సైతం తమ హీరోల క్యాలెండర్స్ విడుదల చేసి సంబరాలు చేసుకుంటున్నారు. మొన్న బాలకృష్ణ అభిమానులు క్యాలెండర్ ని విడుదల చేసారు. ఇప్పుడు తాజాగా హీరో రామ్ ...కి చెందిన అభిమానులు న్యూ ఇయర్ క్యాలెండర్ ని విడుదల చేసారు. అభిమానులంతా ఈ క్యాలెండర్ ని తెప్పించుకుంటున్నారు.మీకు కూడా ఈ క్యాలెండర్ కావాలంటే... [email protected] మెయిల్ చేయండి లేదా..ఈ 8712255685 నెంబర్ లో కాంటాక్ట్ చేయండి.

    https://www.facebook.com/TeluguFilmibeat

    'దేవదాస్‌', 'జగడం', 'మస్కా', 'కందిరీగ'... ఇలా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగాడు. నటన, డ్యాన్సులు, పోరాటాలూ, స్త్టెలింగ్‌.. ఇలా అన్నిటా తనదైన సొంత ముద్ర చూపించుకొన్నాడు. ఇప్పుడు 'పండగ చేస్కో'సినిమాతో మరోసారి వినోదాలు పంచబోతున్నాడు.

    ప్రస్తుతం చేస్తున్న చిత్రం విషయానికి వస్తే..

    Hero Ram's New Year Calendar

    రామ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పండగ చేస్కో' . రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. పరుచూరి కిరీటి నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ''రామ్‌ ఎనర్జీని పూర్తి స్థాయిలో తెరపై చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. రకుల్‌ పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. నాయకానాయికలు, బ్రహ్మానందం కలసి తెరపై పండించే వినోదం ప్రేక్షకులను అలరిస్తుంది'' అన్నారు.

    రామ్‌ మాట్లాడుతూ ''చాలా రోజుల నుంచి కష్టపడి చేసుకున్న కథ ఇది. మా యూనిట్ ఎంతో మనసు పెట్టి చేస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

    ''ఇక్కడ చదివి విదేశాల్లో నాలుగు డాలర్లు సంపాదించుకోవడానికి యువత విదేశాలకు వెళ్లిపోతున్న రోజులివి. ఇలాంటి సమయంలో విదేశాల్లో కోట్లు సంపాదించిన ఓ యువకుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి తన వారి శ్రేయస్సు కోసం ఎలా పోరాడాడు అనేదే చిత్రం'' అన్నారు కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్‌.

    రామ్ తో చేయాలని గత నాలుగేళ్లగా ప్రయత్నించాను. ఈ కథ నా దగ్గరకు వచ్చేసరికి పరిశ్రమ పరిస్థితి బాగాలేదని ఆలోచించాను. అయితే కథ బాగా నచ్చేసరికి ముందడుగు వేశాను'' అన్నారు పరుచూరి ప్రసాద్‌.

    చిత్రంలో సాయికుమార్‌, రావు రమేష్‌, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, సంగీతం: తమన్‌, కూర్పు: గౌతంరాజు, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌.

    English summary
    Now, The fans of Hero Ram have come up with their own presentation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X