»   » హీరో రామ్ పాట అరుదైన రికార్డ్.. యూట్యూబ్‌లో హల్‌చల్!

హీరో రామ్ పాట అరుదైన రికార్డ్.. యూట్యూబ్‌లో హల్‌చల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ హీరోగా గ‌తేడాది విడుద‌లైన నేను శైల‌జ‌ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విడుద‌ల‌కు ముందే ఆ చిత్రంలోని పాట‌లు సినీ అభిమానులను విప‌రీత‌మైన క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. ఆ చిత్రంలోని క్రేజీ క్రేజీ ఫీలింగ్ అనే పాటకు యూట్యూబ్‌లో విశేష స్పందన లభిస్తున్నది. ఆ విషయాన్ని చిత్ర నిర్మాతలు మీడియాతో పంచుకొన్నారు.

మూడు కోట్ల మంది క్రేజీ క్రేజీ ఫీలింగ్

మూడు కోట్ల మంది క్రేజీ క్రేజీ ఫీలింగ్

నేను శైలజ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం వహించారు. ఈ చిత్రంలోని క్రేజీ క్రేజీ ఫీలింగ్‌ పాటను గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి రాయగా, పృథ్వీ చంద్ర పాడారు. ఈ పాటను ఇప్పటికే యూట్యూబ్‌లో మూడు కోట్ల మంది వీక్షించారు. తెలుగు సినిమా పాట‌ల్లో ఇది అరుదైన రికార్డుగా అభివ‌ర్ణించ‌వ‌చ్చు. `నేను శైల‌జ‌` చిత్రాన్ని స్ర‌వంతి మూవీస్ ప‌తాకంపై `స్ర‌వంతి` ర‌వికిశోర్ నిర్మించారు. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టించారు.


 రామ్ తాజా చిత్రం షూటింగ్..

రామ్ తాజా చిత్రం షూటింగ్..

ఇదిలా ఉండగా రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మూడో షెడ్యూల్ జూన్ 14 వరకు హైద‌రాబాద్‌లో జరిగింది. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పిఆర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ‘నేను శైలజ' ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి' రవికిశోర్‌ నిర్మిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్‌ కథానాయికలు.


నెలాఖరు నుంచి అరకులో..

నెలాఖరు నుంచి అరకులో..

నిర్మాత `స్ర‌వంతి` ర‌వికిశోర్ మాట్లాడుతూ రామోజీ ఫిల్మ్ సిటీలో తొలి షెడ్యూల్‌, వైజాగ్‌లో రెండో షెడ్యూల్ చేశాం. మూడో షెడ్యూల్‌ను ఇటీవల ఐదు రోజుల పాటు హైద‌రాబాద్‌లో తెర‌కెక్కించాం. జూన్ 10, 11న కెజీ రెడ్డి కాలేజీలోనూ, 12న సంజీవ‌య్య పార్కులోనూ, 13న రామోజీ ఫిల్మ్ సిటీలోనూ, 14న రాత్రి అంబేద్క‌ర్ యూనివ‌ర్శిటీలోనూ షూటింగ్ చేశాం. ఈ నెలాఖ‌రు నుంచి వైజాగ్‌, అర‌కులో మ‌రో షెడ్యూల్ ఉంటుంది అని చెప్పారు.
 అంచనాలు పెరిగాయి...

అంచనాలు పెరిగాయి...

ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల మాట్లాడుతూ రామ్ హీరోగా నా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `నేను శైల‌జ‌` సూపర్ హిట్ కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో తాజా సినిమా ప‌ట్ల అంచ‌నాలు పెరిగాయి. వాటిని చేరుకునేలా మేం క‌థ‌ను సిద్ధం చేశాం. ఈ క‌థ త‌ప్ప‌కుండా ఫ్రెష్ ఫీల్‌ని క‌లిగిస్తుంది. రామ్ లుక్‌కు ఇప్ప‌టికే చాలా మంచి స్పందన వ‌స్తోంది. నాయిక‌లు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మేఘా ఆకాశ్‌.. ఇద్ద‌రూ సినిమాకు ప్ల‌స్ అవుతారు అని అన్నారు.


దేవీశ్రీ చక్కటి బాణీలు..

దేవీశ్రీ చక్కటి బాణీలు..

ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ మంచి బాణీల‌ను అందించారు. ఇప్ప‌టివ‌ర‌కు తెర‌కెక్కించిన స‌న్నివేశాలు సంతృప్తిక‌రంగా వ‌చ్చాయి అని కిశోర్ తిరుమల అన్నారు. శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు' ఫేమ్‌ ప్రియదర్శి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌ ఎఎస్‌ ప్రకాశ్, ఎడిటింగ్‌ శ్రీకర్‌ ప్రసాద్, సినిమాటోగ్రఫీ సమీర్‌రెడ్డి, సాహిత్యం ‘సిరివెన్నెల' సీతారామశాస్త్రి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ అందిస్తున్నారు.English summary
Hero Ram's Song Crazy crazy feeling song of Nenu Sailaja created history in Youtube. This song was seen by atleast 3 crores members. This is record for Telugu movie. Ram's latest movie shooting going with rocket speed. This movie also directed by Nenu sailaja director Kishore Tirumala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu