»   » హీరో రామ్ సొంత డబ్బా స్కీమ్

హీరో రామ్ సొంత డబ్బా స్కీమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో రామ్ నటించగా గత సంవత్సరం విడుదలైన 'మస్కా'చిత్రం ఇప్పుడు హిందీలో 'ఫూల్‌ ఔర్‌ కాంటే' పేరుతో డబ్బింగై విడుదలైంది. హన్సిక, షీలా హీరోయిన్స్ గా బి.గోపాల్‌ డైరక్షన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని నిర్మాత ఎమ్మెస్‌ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసారు. అయితే ఎవరకి పెద్దగా తెలియని ఈ విషయాన్ని మీడియాకు చెప్పి స్వయంగా డబ్బా కొట్టుకుంటున్నారు. పనిలో పనిగా రెండు నెలల క్రితం తను ప్రారంబించిన బ్లాగ్ గురించి కూడా పబ్లిసిటీ మొదలెట్టాడు. రామ్ మాటల్లోనే...''అభిమానులతో మన మనసులోని మాటల్ని చెప్పేందుకు బ్లాగ్ చక్కని వేదిక. అలాగే వాళ్లు ఏమనుకొంటున్నారో కూడా తెలుసుకొనే వీలు చిక్కుతోంది. అంతేగాక మనకు కలిగిన ఆనందానుభూతుల్ని కూడా అందరితోను సులువుగా పంచుకోగలుగుతున్నాను.

అతెందుకు ఇటీవల ముంబయి వెళ్లాను కదా.. 'రామ రామ కృష్ణ కృష్ణ' షూటింగ్‌ కోసం. అక్కడ ఫూల్‌ ఔర్‌ కాంటే అనే పోస్టర్‌ చూశాను... ఒక్కసారి ఆశ్చర్యపోయాను. అది నేను తెలుగులో నటించిన 'మస్కా' చిత్రానికి అనువాద రూపం. ముంబయిలో నా ఫొటోతో పోస్టర్‌ కనిపించడం భలే అనిపించింది. ఈ విషయాన్నే వెంటనే అభిమానులకీ, మిత్రులకీ బ్లాగ్‌ ద్వారా తెలియజేశాను'' అంటున్నాడు. అలాగే గత రెండు నెలల నుంచి తాను వెబ్‌సైట్‌ను అప్‌డేట్‌ చేస్తున్నట్లు, ఇప్పటికి 75వేలు 'హిట్స్‌' వచ్చినట్లు చెప్పారు రామ్‌. దేవదాస్‌, జగడం, రెడీ, మస్కా, గణేష్‌ చిత్రాల అనంతరం రామ్‌ చేస్తున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. లక్ష్యం వాసు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. మరో హీరో అర్జున్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu