»   » నైట్ క్లబ్ లో డిజేగా హీరో రామ్

నైట్ క్లబ్ లో డిజేగా హీరో రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :త్వరలో హీరో నైట్ క్లబ్ లో డిజే గా పనిచేస్తూ కనిపించనున్నారు. అయితే అది నిజ జీవితంలో కాదు సుమా. ఆయన తాజా చిత్రం కోసం ఆయన ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలోని చివరి పాటని ఇటీవలే గోవాలో షూట్ చేసి షూటింగ్ ని పూర్తి చేసారు.

రామ్ మాట్లాడుతూ ‘ నేను నైట్ క్లబ్ లో పనిచేసే డిజేగా కనిపిస్తే, కీర్తి సురేష్ టిపికల్ తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. ఈ సినిమాలో భారీ భారీ లొకేషన్స్ లో తీసిన సాంగ్స్ ఉండవు. అన్నీ కథలో భాగంగా చాలా రియలిస్టిక్ గా ఉంటయని' రామ్ తెలిపాడు.

Hero Ram Working as DJ

రామ్‌ వేగం పెంచాడు. విరామం లేకుండా వెంట వెంటనే కొత్త సినిమాలకు పచ్చజెండా వూపేస్తున్నాడు. రీసెంట్ గా 'పండగ చేస్కో', 'శివం' చిత్రాల్లో పలకిరించిన ఆయన 'నేను శైలజ' పేరుతో మరో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకొన్నారు. కిషోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు.

శ్రీసవంతి మూవీస్‌ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్‌ నటిస్తుంది. ఈ మలయాళీ అందం ప్రస్తుతం నరేష్‌ తనయుడు నవీన్‌ విజయ్‌కృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో నటిస్తోంది. రామ్‌ 'నేను శైలజ'కు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌.

English summary
Ram says. " we are keeping "Nenu Sailaja" as natural . I play a DJ during a night club and heroine Keerthi Suresh plays a typical Telugu lady role. there's no song wherever we tend to dance like crazy in exotic locales. All the songs are measure simply montages and appearance realistic", Ram avers.
Please Wait while comments are loading...