»   » అఖిల్,రానా లాంచ్ చేసిన ఆ జిమ్‌ రకుల్‌ప్రీత్ సింగ్ దే

అఖిల్,రానా లాంచ్ చేసిన ఆ జిమ్‌ రకుల్‌ప్రీత్ సింగ్ దే

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో కొంత మంది ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి వారిలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఆమె షూటింగ్ లేనప్పుడు ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతుఒటారని సమాచారం. ఫిట్నెస్ పట్ల తనకు ఉన్న మక్కువ తోనే గచ్చిబౌలి లో స్టూడియో 45 అనే ఫిట్ నెస్ స్టూడియో మొదలు పెట్టింది. పేరుస్టుడియోనే గానీ మామూలు భాషలో చెప్పాలి అంటే జిమ్...

Hero Rana and Akhil Launch Rakul's F45 Gym in Vizag

ఇది విజయవంతం కావడంతో ఈ ఫిట్నెస్ చైన్ ను మరిన్ని ఆంధ్ర ప్రదేశ్ లోని మరిన్ని నగరాలకు విస్తరించాలని ప్రయత్నిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే వైజాగ్ లో తన జిమ్ బ్రాంచ్ ను తెరిచింది రకుల్. హైదరాబాదులో వివిధ ప్రాంతాల్లో జిమ్ లు ఏర్పాటు చేశానని, ఏపీలో కూడా జిమ్ ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నానని, అందుకే విశాఖపట్టణంలో జిమ్ ఏర్పాటు చేశానని చెప్పింది. అయితే మామూలుగా ఏదైనా షాప్ ఓపెనింగ్ కి హీరోయిన్లను పిలవటం మామూలే మరి ఈ హీరోయినే ఓపెన్ చేసిన జిమ్ ఓపెనింగ్ కోసం ఎవరొచ్చారో తెలుసా..??

Hero Rana and Akhil Launch Rakul's F45 Gym in Vizag

టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి రానా, అక్కినేని అఖిల్ లు ఈ జిమ్ ని లాంచ్ చేశారు. అత్యంత పాష్ గా ఉండే దస్పల్లా హిల్స్ ప్రాంతంలో రకుల్ ఫిట్ నెస్ స్టూడియోని ప్రారంభించిందంటే ఈ అమ్మడి రేంజ్ ఏ మేరకు పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. త్వరలో మరిన్ని ప్రాంతాలలో ఈ ఫిట్ నెస్ స్టూడియోస్ ని ప్రారంభించాలని రకుల్ భావిస్తుంది.

ఎంతయినా ఈ కాలం హీరోయిన్లు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఒకప్పటిలా సంపాదించిందంతా పోగొట్టుకొని చివరికాలం లో చాలా కష్టాలు పడ్ద నటీమణులను చూసి నేర్చుకున్న పాఠాలేమో గానీ, ప్రతీ హీరోయిన్ ఇలా సైడ్ బిజినెస్ లతో గ్లామర్ ఫీల్డ్ లో తమ హవా ముగిసే లోపు ఆర్హికంగా ఒక సపోర్ట్ ఏర్పాటు చేసుకుంటున్నారు.

English summary
Heroine Rakul Preet Singh is a fitness freak, who opened a gym named F45 in Hyderabad already and she has launched another branch in Vizag also. Heroes Rana and Akhil have inaugurated this gym
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu