»   » రవితేజ తమ్ముడు భరత్ దుర్మరణం

రవితేజ తమ్ముడు భరత్ దుర్మరణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ నటుడూ హీరో రవితేజ తమ్ముడూ అయిన భరత్ రాజ్ ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. శంశాబాద్ మండలం కొత్వాల్ గూడ వద్ద ఓఆర్ఆర్ పై ఆగి ఉన్న లారీని భరత్ కారు వెనుక నుండి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 46 ఎళ్ళ వయసున్న భరత్ శంషాబాద్ నుండి నుండి గచ్చిబౌలి వెళుతుండగా ఈ అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది.కాగా... ఈ ప్రమాదాన్ని భరత్ స్నేహితులు గోప్యంగా ఉంచారు. ప్రమాదవార్త తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

 Hero Raviteja Brotheris Dead in a car accident

అనంతరం ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి రవితేజ సోదరుడు భరత్‌గా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి గురైన కారు రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పేరుతో ఉంది. ఈ ఘటన రాత్రి 10 గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ప్ర‌మాదంకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

English summary
Hero Raviteja Brotheris Dead in a car accident this morning in hyderabad outer ring road
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu