twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా భార్య నాకా స్వేచ్ఛనిచ్చింది: శ్రీకాంత్

    By Srikanya
    |

    హైదరాబాద్ :ఒక్కోసారి నాకు షూటింగుల్లో రాత్రి రెండు, మూడై పోయేది. చాలా సార్లు విదేశాలకూ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఒక్కసారి కూడా నా భార్య ఇంటికి త్వరగా రమ్మని అడిగింది లేదు. నా వృత్తిని అంతలా గౌరవిస్తుంది కాబట్టే అది సాధ్యమైంది. ఇంటి దగ్గర ఏ టెన్షన్‌ లేకపోతే బయట హాయిగా పనిచేసుకోవచ్చు. వూహ నాకా స్వేచ్ఛనిచ్చింది. ఇంటి గురించి వర్రీ అయ్యే పరిస్థితి తీసుకురాదు. మొత్తం తనే చూసుకుంటుంది. అందుకే పనిపైన పూర్తి దృష్టి పెట్టగలుగుతా అంటున్నారు శ్రీకాంత్. ప్రస్తుతం వెంకీ..షాడో షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన తన కుటుంబం గురించి సరదాగా మీడియాతో ముచ్చటించారు.

    అలాగే అమ్మ తరవాత నా జీవితంలో అంత ప్రభావం చూపిన వ్యక్తి వూహే. ఇద్దరం సినిమాల్లో కలిసి నటించార. తన గురించి బాగా తెలుసుకొనే అవకాశం అప్పుడే దొరికింది. మాటల్లో బోలెడన్ని తెలివితేటలు, మనసులో అమాయకత్వం కలగలిసిన అమ్మాయి తను. ఆలోచన ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలియదు కానీ ఇలాంటి అమ్మాయితో జీవితాంతం కలిసుండొచ్చు అన్న ఫీలింగ్‌ మాత్రం వచ్చేసింది. తను చాలా కేరింగ్‌. ప్రతి ఒక్కరితో చక్కగా మాట్లాడుతుంది. పెళ్లయ్యాకా ఏ మాత్రం మార్పు రాలేదు. తనూ సినిమాల్లో పనిచేసి ఉండటం ఓ రకంగా నా అదృష్టమే అన్నారు.

    ఇక ఇప్పుడు తను షూటింగ్‌లకూ, సినిమాలకూ అస్సలు రాదు. ఒక్కోసారి నేనెందులో నటిస్తున్నానో కూడా తెలియదు. కుటుంబాన్నే ప్రపంచంగా మార్చేసుకుంది. తనకు భక్తి చాలా ఎక్కువ. పూజలు చేస్తుంది. ఉపవాసాలుంటుంది. ఇక మొక్కుల గురించి చెప్పక్కర్లేదు. 'ఫలానా పని జరిగితే ఆయనను గుడికి తీసుకొస్తా' అని మొక్కేసుకుంటుంది. నాకేమో ప్రతి సారీ కుదరదు. కానీ తప్పదు కదా. ఓసారి 'కావాలంటే నువ్వు మొక్కుకో. నన్ను మాత్రం ఇన్వాల్వ్‌ చేయొద్దు' అని చెప్పా. అప్పట్నుంచి నా గురించి మొక్కుకోవడం తగ్గించింది. నా ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ పెడుతుంది.

    అందుకే సిగరెట్ల విషయంలో తను చాలా సీరియస్‌. మానేయమని ఎప్పుడూ గొడవచేస్తుంది. నేనూ చాలా సార్లు మానేశాను కూడా. కానీ అన్నిసార్లూ మొదలుపెట్టా. తనిక కోపంతో అడగడం మానేసింది. మాటిస్తే వర్కవుట్‌ కావట్లేదని ఓసారి నేనే చెప్పకుండా మానేశా. ఇప్పుడు దాని జోలికి వెళ్లట్లేదు. తనైతే ఫుల్‌ హ్యాపీ. ఖాళీ సమయం వచ్చిందంటే ఇంట్లోనే గడుపుతా. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ దొరికే ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో వాళ్లకు తీసుకొస్తా. అమ్మకు మౌంట్‌ అబూ వెళ్లడమంటే ఇష్టం. అడక్కుండానే వీలైనప్పుడల్లా పంపించే ఏర్పాట్లు చేస్తా. ఇంట్లో అందరూ నా కోసం కష్టపడ్డారు. అందుకే నోరు తెరిచి ఏదీ కావాలని అడిగే అవకాశం వాళ్లకివ్వను. అమ్మ మాత్రం 'మాకు ఇవన్నీ ఎందుకురా. నువ్వు కాసేపు మాతో ఆనందంగా గడిపితే చాలు' అంటుంది కళ్లనిండా ప్రేమ నింపుకొని అంటూ తన కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు శ్రీకాంత్.

    English summary
    
 Srikanth is married to Ooha and has two sons, Roshan who is the eldest and Rohan who is the youngest and has a daughter, Medha. He played minor roles in many films before playing a hero.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X