»   » శ్రీకాంత్ హీరోగా, పోసాని దర్శకత్వంలో తెరకెక్కనున్న వైయస్ జీవిత చరిత్ర!

శ్రీకాంత్ హీరోగా, పోసాని దర్శకత్వంలో తెరకెక్కనున్న వైయస్ జీవిత చరిత్ర!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు పోసాని కృష్ణ మురళీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మించే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. వైయస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ఆరంభం నుండి ఆయన చనిపోయే వరకు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని రెండున్నర గంటల చిత్రంగా తెరపైకి తేవడానికి పోసాని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీని వరుసగా రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చిన ఘనత వైయస్ సొంతం. ఆయన పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశ పెట్టి ప్రజలకు చేరువయ్యారు.

ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ కోణాన్ని సృశిస్తూ ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు చేసిన కార్యక్రమాలను ఆ తర్వాత ఆయన మృతి తదితర విషయాలతో తెరకెక్కించనున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ప్రముఖ కథా నాయకుడు శ్రీకాంత్ వైయస్ పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా ఇంతకుముందు పోసాని, శ్రీకాంత్ కలయికలో ఆపరేషన్ దుర్యోదన వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో రాజకీయాలను పోసాని సృశించారు.

English summary
It seems, director Posani Krishna Murali is planning for directing a film about late YS Rajasekhar Reddy soon. Hero Srikanth may played YS role in cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu