»   »  తాతయ్య చనిపోవడంతో మానసిక వేదనకు గురయ్యాను:, పెళ్ళి అవసరం కాదు

తాతయ్య చనిపోవడంతో మానసిక వేదనకు గురయ్యాను:, పెళ్ళి అవసరం కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందీలో వచ్చిన విక్కీ డోనర్ అనే సినిమాని తెలుగులో రీమేక్ సినిమా చేయాలనుకున్న సమయంలో తాతగారు(అక్కినేని) చనిపోయారు. ఆయన చనిపోవడం నా జీవితంలో పెద్దలోటు. నలభైఏళ్ల తరువాత ఇంట్లో ఒంటరిగా ఒక్కడినే వుంటున్నాను. రెండేళ్ల వ్యవధిలో మా అమ్మమ్మ, తాతయ్య చనిపోవడంతో వ్యక్తిగతంగా చాలా మానసిక వేదనకు గురయ్యాను. ఆ పరిస్థితుల నుంచి తేరుకుని ఇకపై చేసే సినిమా చాలా జాగ్రత్తగా చేయాలనే చాలా గ్యాప్ తీసుకున్నాను... ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో సుమంత్ చెప్పిన మాటలివి

తన వ్యక్తిగత జీవితం గురించీ ఇకముందు ఎలా ఉండాలనుకుంటున్నాడూ.., తాతయ్య అక్కినేని నాగేశ్వర రావు గారి మరణం తో తాను ఎదుర్కున్న మానసిక వేదన గురించీ చెప్పుకొచ్చాడు సుమంత్. సుమంత్ నటించిన "నరుడా డోనరుడా" రేపు విడుదల కాబోతోంది. ఆ సినిమా విశేషాలతో పాటు సుమంత్ చెప్పిన విషయాలు కూడా తన మాటల్లోనే....

 యూనివర్సల్ సమస్య నేపథ్యంలో :

యూనివర్సల్ సమస్య నేపథ్యంలో :


ఈ సినిమా అనుకుంటున్నప్పుడే హైదరాబాద్‌లో వీర్యదానంకు సంబంధించిన కేసుల్ని చూశాను. అయితే వాటి గురించి పెద్దగా ఎక్కడా ప్రచారం జరగలేదు. పిల్లలు పుట్టటం లేదంటే తమ లో లోపం ఉందని బయటికి ఎవరూ చెప్పుకోలేరు కదా. దేశం మొత్తంలో 15 శాతం మంది మగవాళ్లు, ఆడవాళ్లు పిల్లలు పుట్టక సతమతమవుతున్నారు. అయితే సమస్య మనదేశం లోది మాత్రమే కాదు ప్రపంచమంతా ఉన్నదే యూనివర్సల్ సమస్య నేపథ్యంలో తీసిన సినిమా కాబట్టి తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాం.

 అక్కినేని చనిపోయారు:

అక్కినేని చనిపోయారు:


హిందీలో వచ్చిన విక్కీ డోనర్ అనే సినిమాని తెలుగులో రీమేక్ సినిమా చేయాలనుకున్న సమయంలో తాతగారు(అక్కినేని) చనిపోయారు. ఆయన చనిపోవడం నా జీవితంలో పెద్దలోటు. నలభైఏళ్ల తరువాత ఇంట్లో ఒంటరిగా ఒక్కడినే వుంటున్నాను. రెండేళ్ల వ్యవధిలో మా అమ్మమ్మ, తాతయ్య చనిపోవడంతో వ్యక్తిగతంగా చాలా మానసిక వేదనకు గురయ్యాను. ఆ పరిస్థితుల నుంచి తేరుకుని ఇకపై చేసే సినిమా చాలా జాగ్రత్తగా చేయాలనే చాలా గ్యాప్ తీసుకున్నాను...

 మళ్లీ పెళ్లి చేసుకోమని తాతగారుచెప్పలేదు:

మళ్లీ పెళ్లి చేసుకోమని తాతగారుచెప్పలేదు:


తాతగారికి శస్త్ర చికిత్స జరిగిన తరువాత ఆయన చనిపోయే వరకు దాదాపు ఆరు నెలలు ఆయనతో గడిపాను. ఆ సమయంలో వీలైనంత ఆనందంగా ఆయన్ని వుంచాలని కుటుంబ సభ్యులందరం అనుకున్నాం. అలాగే వున్నాం. నా వ్యక్తిగత విషయాల గురించి గానీ, కెరీర్ గురించి గానీ ఆయనఎప్పుడూ చర్చించలేదు. మళ్లీ పెళ్లి చేసుకోమని కూడా తాతగారు నాతో చెప్పలేదు. ఇప్పుడు నాకూ అలాంటి ఉద్దేశం లేదు. పెళ్ళి అందరికీ అవసరం ఉంటుందని నేననుకోవటం లేదు.

 ఆ డైలాగ్ సినిమాకే కాదు నా లైఫ్ కి కూడా

ఆ డైలాగ్ సినిమాకే కాదు నా లైఫ్ కి కూడా


ప్రస్తుతానికి అయితే నాకుపెళ్లి అవసరంలేదు, మరీ ఖచ్చితం అనికూడా అనిపించటం లేదు.నరుడా డోనరుడా ఇంటర్వెల్ సమయం లో తనికెళ్ళ భరణి ఒక డైలాగ్ చెబుతారు నిజానికి ఆ డైలాగ్ సినిమాకే కాదు నా లైఫ్ కి కూడా సరిగ్గా సరిపోతుంది. ఆ డైలాగ్ ఏమిటో రేపు సినిమా వచ్చాక చూస్తే మీకు అర్థమౌతుంది. అంటూ చెప్పాడు సుమంత్.

 బాలీవుడ్ కామెడీ డ్రామా

బాలీవుడ్ కామెడీ డ్రామా


దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత సుమంత్ తన తర్వాత మూవీ, నరుడా డోనరుడాతో సిద్ధమయ్యాడు. ఈ సినిమాని నవంబర్ 4న విడుదల చేయడానికి సిద్ధం చేసారు. అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ కామెడీ డ్రామా, విక్కీ డోనర్ అఫీసియల్ రీమేక్ గా రానున్న ఈ సినిమాలో పల్లవి సుభాష్ ఫిమేల్ లీడ్ చేస్తోంది మరియు అన్ను కపూర్ రోల్ తనికెళ్ళ భరణి పోషిస్తున్నారు.

 మరో ప్రమోషనల్ ఇంటర్వ్యూ:

మరో ప్రమోషనల్ ఇంటర్వ్యూ:


తాజాగా ఇచ్చిన మరో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కూడా, విక్కీ డోనర్ ని రీమేక్ చేయాలనే నిర్ణయం వెనుక వున్న ముఖ్య కారణం తన తాత మరియు లెజెండరీ రంగ స్థల నటుడు అక్కినేని నాగేశ్వర రావు ఎప్పుడూ విక్కీ డోనర్ లాంటి విభిన్న సినిమాల్లో నటించమని అడిగేవాడని సుమంత్ చెప్పాడు. ఆ తర్వాతే విక్కీ డోనర్ ని రీమేక్ చేయాలనీ సుమంత్ నిర్ణయించుకున్నట్టు, తనని స్క్రిప్ట్స్ తో సంప్రదించిన అందరు డైరెక్టర్లతో ఈ సినిమా రీమేక్ సూచించినట్టు చెప్తున్నారు.

 స్క్రిప్ట్ కోసం ఎదురు చూశా:

స్క్రిప్ట్ కోసం ఎదురు చూశా:


‘2012లో ‘విక్కీ డోనర్' చూశా, బాగా నచ్చింది. చివరి రోజుల్లో తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) టీవీలో చూసిన చివరి రెండు మూడు సినిమాల్లో ఇదొకటి. ‘తెలుగులో ఇలాంటి సినిమా ఎందుకు చేయకూడదు' అన్నారాయన. ఏడాదిపాటు ‘విక్కీ డోనర్' లాంటి స్క్రిప్ట్ కోసం ఎదురు చూశా. నిర్మాత రామ్మోహన్ సలహాతో రీమేక్‌కి ఓటేశా. రియల్ లైఫ్‌లో నాకు పిల్లలు లేకపోవడం ఈ సినిమా చేయడానికి ఓ కారణం'' అని చెప్పాడు.

 అడల్ట్ కంటెంట్ ఉండదు:

అడల్ట్ కంటెంట్ ఉండదు:


ఇది పక్కాగా అందరూ చూసే సినిమా. బోల్డ్‌గా ఉంటుంది కానీ, ఎక్కడా వల్గారిటీ, అడల్ట్ కంటెంట్ ఉండదు. సెన్సార్ వాళ్ళు కూడా యూ/ఏ రేటింగ్ ఇచ్చారు. ఇది హాట్ సినిమానో, ఏ రేటెడ్ సినిమానో అయితే కాదు.తదుపరి సినిమా ఆలోచనలేవీ ఇంకా పెట్టుకోలేదు. ప్రస్తుతానికి కథలు వింటున్నా, ఏది ఫిక్స్ అవుతుందో చూడాలి. ఇక విలన్‌గా చేయడమంటే నాకెంతో ఇష్టం. చాలాసార్లు ఇదే విషయం చెప్పినా మరి నాకైతే అలాంటి అవకాశాలేవీ రాలేదు. అలాంటి అవకాశాలే వస్తే చేయడానికి సిద్ధంగా ఉంటా.

 నరుడా డోనరుడా:

నరుడా డోనరుడా:


2014లో వచ్చిన ‘ఏమో గుర్రం ఎగరా వచ్చు' అనే సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని హీరో సుమంత్ ‘నరుడా డోనరుడా' అనే సినిమాతో వచ్చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయం సొంతం చేసుకున్న ‘విక్కీ డోనర్' అనే సినిమాకు రీమేకే ఈ ‘నరుడా డోనరుడా'! ఇప్పటికే ట్రైలర్, పోస్టర్స్‌తో ఎక్కడిలేని క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

English summary
Akkineni hero, Sumanth has been going through a dull phase in his career recently. Losing no hope he is back with his latest film Naruda Donaruda. On the eve of the film’s release
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu