»   » హీరో సునీల్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

హీరో సునీల్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో సునీల్ జన్మదిన వేడుకలు నేడు సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో చిన్నారుల సమక్షంలో ఘనంగా జరుపుకొన్నాడు. స్కూల్ బాగోగుల కోసం సహాయార్ధం గతంలో 2 లక్షల రూపాయల విరాళాన్ని అందించిన సునీల్.. ఈ ఏడాది చిన్నారుల కోరిక మేరకు వారి చదువుకు అవసరమైన 55 అంగుళాల సామ్ సంగ్ టివి సమకూర్చాడు.

ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.....ఎడ్యుకేషన్ ఛానల్స్ లో వస్తున్న కార్యక్రమాల కోసం టీవీ అయితే బావుంటుందని సిబ్బంది సూచించడంతో నా బర్త్ డే గుర్తుగా దీన్ని బహూకరించినట్లు తెలిపారు.


ఇటీవల "కృష్ణాష్టమి" చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్న సునీల్.. ప్రస్తుతం వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఈడు గోల్డ్ ఎహే" చిత్రంలో నటిస్తున్నాడు.


ఇకపోతే.. చిన్నారుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడంతోపాటు వారి విద్యాభ్యాసానికి అవసరమైన టివిని సమకూర్చడం, వారితో సంతోషంగా గడపడం పిల్లలకు మానసిక సంతృప్తినిచ్చిందని, సునీల్ ఇదే విధంగా భవిష్యత్ మరింత స్టార్ డమ్ దక్కించుకొని.. ఇదే విధంగా ఎంతో మందికి సహాయపడాలని విక్టోరియా మెమోరియల్ స్కూల్ సిబ్బంది కోరుకొన్నారు!


స్లైడ్ షోలో ఫోటోస్....


టీవీ కానుక

టీవీ కానుక

విక్టోరియా మొమోరియల్ స్కూల్ విద్యార్థులకు టీవీ బహూకరిస్తున్నసునీల్.


సునీల్

సునీల్

స్కూలు విద్యార్థుల సమక్షంలో సునీల్ ఎంతో హ్యాపీగా పుట్టినరోజు వేడుక జరుపుకున్నాడు.


చిన్నారులతో...

చిన్నారులతో...

విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో చిన్నారులతో సునీల్..


నెక్ట్స్ మూవీ

నెక్ట్స్ మూవీ

ప్రస్తుతం సునీల్ వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఈడు గోల్డ్ ఎహే" చిత్రంలో నటిస్తున్నాడు.


సునీల్ బర్త్ సెలబ్రేషన్స్ వీడియో

సునీల్ బర్త్ సెలబ్రేషన్స్ వీడియో


English summary
Hero Sunil Birthday Celebrations at Victoria Memorial School.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu