»   »  యాక్షన్ సరే...సునీల్ హిట్ కొడతాడా ?

యాక్షన్ సరే...సునీల్ హిట్ కొడతాడా ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సునీల్ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ల డైరక్షన్ లో ఓ సినిమా తెరక్కెక్కుతోంది. దీనిలో మన్నార్ చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఆర్‌.సుదర్శన్‌ రెడ్డి నిర్మాతగా ఉన్నారు. ఈమధ్యన విశాఖపట్నంలో కొన్ని కీలకమైన సన్నివేశాలు తీసారు. తరువాత షెడ్యూలు హైదరాబాద్‌లో మొదలవుతుంది.

దర్శకుడు వంశీ మాట్లాడుతూ ....35 రోజుల పాటు ఏకధాటిగా విశాఖపట్నంలో చిత్రీకరణ జరిపాం. సునీల్‌, కబీర్‌, సత్య ప్రకాష్‌, ఉదయ్‌లపై ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని తెరకెక్కించాం. వీటికి కనల్‌ కణ్ణన్‌ నేతృత్వం వహించారు. అన్ని వర్గాలవారినీ అలరించే సినిమా అవుతుందన్నారు.

నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. . ప్రేమ కథా చిత్రమ్ తర్వాత ఎన్నో కథలు విన్నాను. కానీ నా మొదటి ప్రయత్నాన్ని చిన్న చిత్రాల్లో అఖండ విజయంగా అందించిన తెలుగు ప్రేక్షకులందరి అంచనాలు అందుకునేలా మా బ్యానర్ ఆర్.పి. ఏ క్రియేషన్స్ వ్యాల్యూని నిలబెట్టే చిత్రంగా ఉండాలని మంచి కథలు చూస్తున్న సమయంలో రక్ష చిత్రం దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ల మంచి కథతో నా దగ్గరకి వచ్చారు. నేను, సునీల్ గారు విన్న వెంటనే అంగీకరించాను.

సునీల్ గారికి ఎలాంటి కథ ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో వంద శాతం అదే రేంజి కథతో మా బ్యానర్ లో వస్తున్నాము. సునీల్ గరి బాడీ లాంగ్వేజ్ ని కొత్తగా చూపించబోతున్నారు దర్శకుడు వంశీ. సునీల్ గారి నుంచి ఎలాంటి ఎంటర్ట్మెంట్ కోరుకుంటామో అదే ఈ చిత్రంలో ఉంటుంది. పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా వుంటుంది అని అన్నారు.

Hero Sunil is busy in shooting in Vizag

దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ల మాట్లాడుతూ... రక్ష లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాకు అన్ని కమర్షియల్ హంగులున్న కథ కుదిరింది. ఈ కథని సునీల్ గారికి చెప్పిన వెంటనే ఇలాంటి కథ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను అన్నారు. ఓ కమర్షియల్ కథని సునీల్ గారు హీరోగ ఓకే చేయటం, దానికి నిర్మాత సుదర్శన్ రెడ్డి గారు నిర్మాతగా ఉండటం చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

ఇది వరకు సునీల్‌ వెటకారానికి, గోదావరి యాసకూడా తోడవ్వడంతో తను చెప్పిన ప్రతి డైలాగు నవ్వు తెప్పించ్చేవి. చాలా సినిమాల్లో కమెడియన్ గా నటింసి మెప్పించిన ఈ అందగాడు ‘అందాలరాముడు' సినిమా తో హీరోగా మారీ తన సత్తా చూపించాడు. తరవాత వాటికి కండలు తోడవ్వడంతో మాస్‌ని ఆకట్టుకునే ప్రయత్నంచేసాడు.

English summary
Sunil is acting in a new movie in the direction of Vamsi Krishna Akella. The film has completed its first shooting schedule in Vizag.
Please Wait while comments are loading...