For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆయన భార్యతో రొమాన్స్.. బాధగా అనిపించినా.. తప్పలేదు.. సూర్య ఎమోషనల్

  |

  దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న తమిళ సినిమా 'కప్పాన్'. తెలుగులో ఈ సినిమా 'బందోబస్త్'గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. సూర్యతోపాటు ప్రముఖ నటుడు మోహన్ లాల్, తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్ర పాట‌ల‌ను ఆదివారం చెన్నైలో విడుద‌ల చేశారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా హీరో సూర్య ఉద్వేగంగా ప్రసంగించారు. సూర్య చెప్పిన మాటలివే..

   కేవీ ఆనంద్‌తో మూడో చిత్రం

  కేవీ ఆనంద్‌తో మూడో చిత్రం

  హీరో సూర్య మాట్లాడుతూ - ``నా బ‌ల‌మేంటి? అని ఎవ‌రైనా అడిగితే.. మ‌రో ఆలోచ‌న లేకుండా ఫ్యాన్స్ అనే చెబుతాను. ఈ 'బందోబ‌స్త్' చిత్ర ఆడియో కోసం హ్యారీశ్ జైరాజ్ ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో తెలుసు. త‌న‌తో నేను చేస్తోన్న 9వ సినిమా. ఇక కేవీ ఆనంద్‌ గారితో నా జ‌ర్నీ ఎప్ప‌టి నుండో కొన‌సాగుతుందో ప్రేక్షకులకు తెలుసు. ఆయ‌న‌తో 'అయాన్‌' (వీడొక్క‌డే), 'మాట్రాన్‌' (బ్ర‌ద‌ర్స్‌) చిత్రాలు చేశాను. ఇది మా క‌ల‌యిక‌లో వ‌స్తోన్న మూడో సినిమా అని అన్నారు.

  కేవీ ఆనంద్ పనిరాక్షసుడు

  కేవీ ఆనంద్ పనిరాక్షసుడు

  దర్శకుడు కేవీ ఆనంద్ గొప్ప ప‌ని రాక్ష‌సుడు. అంద‌రినీ మెప్పించే సినిమా దీన్ని మ‌లిచాడు. ఇందులో నేను స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ గ్రూప్ సభ్యుడి పాత్ర‌లో న‌టించాను. ఈ సినిమా ఇంత గొప్ప‌గా వ‌చ్చిందంటే ముందుగా నిర్మాత సుభాస్క‌రన్‌గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సినిమాలో మోహ‌న్‌లాల్‌గారితో క‌లిసి న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక అన్న‌లా ఆద‌రించారు. ఎన్నో కొత్త విష‌యాల‌ను చెప్పారు. ఆయ‌న‌తో కలిసి 25 రోజుల పాటు ప‌నిచేశాను. ఇది నాకు ఎంతో ఇంపార్టెంట్ సినిమా అని సూర్య అన్నారు.

  ఆర్య ఉన్నప్పటికీ.. సాయేషాతో జంటగా

  ఆర్య ఉన్నప్పటికీ.. సాయేషాతో జంటగా

  అలాగే... సినిమాలో ఆర్య‌, స‌యేషా జంట మంచి న‌ట‌న‌ కన‌ప‌రిచారు. ఈ సినిమాలో ఆర్య ఉన్న‌ప్ప‌టికీ నేను స‌యేషాతో జంట‌గా న‌టించాను. కొంత బాధగా అనిపించినా సినిమా కాబ‌ట్టి త‌ప్ప‌లేదు. ప్రేక్ష‌కులు న‌న్ను ఇంతలా ఆశీర్వ‌దిస్తార‌ని నేను క‌ల‌లో కూడా అనుకోలేదు. మ‌న ప్ర‌య‌త్నం త‌ప్పుకావ‌చ్చు. కానీ.. ప్ర‌య‌త్నాలు చేయ‌డం మాత్రం మానుకోకూడ‌దు. అంద‌రూ అలాగే క‌ష్ట‌ప‌డితే, త‌ప్ప‌కుండా స‌క్సెస్ వ‌స్తుంది అని సూర్య పేర్కొన్నారు.

  రజనీకాంత్‌కు థ్యాంక్స్

  రజనీకాంత్‌కు థ్యాంక్స్

  గొప్ప గొప్ప‌వారికే జ‌యాప‌జ‌యాలు త‌ప్ప‌లేదు. ఈ వేడుక‌కి ముఖ్య అతిథిగా వ‌చ్చిన ర‌జనీకాంత్‌గారికి థ్యాంక్స్‌. ఆయ‌న చెప్పిన‌ట్లు ఆయ‌న దారి ఎప్పుడూ ర‌హ‌దారే. ఆయ‌న ఒక తెరిచిన పుస్త‌కం. ఆయ‌న దారిలో మ‌రొక‌రు రాలేరు. రియ‌ల్ లైఫ్‌లో ఆయ‌నొక హీరో అనే సంగ‌తి మ‌న‌కు తెల‌సిందే. ఇక ఇదే వేడుక‌కి మ‌నల్ని ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన శంక‌ర్‌గారు ప్ర‌తి సినిమాతో మ‌న సినిమాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళుతున్నారు.

  English summary
  Actor Suriya, Sayyeshaa Saigal, Arya, Mohan lal's latest movie is Kaappaan. This movie audio release function held in Chennai. Rajinikanth and Shankar are the Guests. In this function, Rajinikanth made sensational comments on Suriya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X