Just In
- 2 min ago
పుకార్లకు చెక్ పెట్టబోతున్న త్రివిక్రమ్: ఎన్టీఆర్ సినిమా కోసం ఆమెనే తీసుకొస్తున్నాడు
- 34 min ago
దర్శకుడితో కాజల్ రొమాన్స్.. పెళ్లి తరువాత కూడా అలాంటివి తగ్గించట్లేదుగా..
- 47 min ago
‘కార్తీక దీపం’ హీరోయిన్ అరుదైన రికార్డు: తెలుగులో ఈ ఘనత సాధించిన ఏకైక నటిగా వంటలక్క
- 1 hr ago
Box office: మొత్తానికి హాఫ్ సెంచరీ కొట్టేసిన మాస్ రాజా.. క్రాక్ తెచ్చిన లాభాలు ఎంతంటే?
Don't Miss!
- Finance
ప్రాఫిట్ బుకింగ్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, 500 పాయింట్లు డౌన్
- Sports
కృనాల్ పాండ్యాతో గొడవ.. దీపక్ హుడాకు భారీ షాక్!!
- News
వాజ్‌పేయితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు: 20 ఏళ్ల నాటి ఫొటోతో: కారణం?
- Automobiles
కొత్త 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ వస్తోందోచ్..
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో తరుణ్ బర్త్ డే వేడుకలు.. సందడి చేసిన తారలు.. పిక్స్ వైరల్
హీరో తరుణ్ ఈ మధ్య అంతగా లైమ్ లైట్‌లో లేడు. కానీ ఒకప్పుడు తరుణ్ ఇమేజ్ ఆకాశమంత ఎత్తులో ఉండేది. వరుస హిట్లతో లవర్ బాయ్ ఇమేజ్ దక్కించుకున్నాడు. లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోల్లో తరుణ్ ముందు వరుసలో ఉంటాడు. అయితే తరుణ్ హిట్ కొట్టే ఎన్నో యేళ్లు అవుతోంది. ఇక ఇప్పుడున్న కాలంతో పరిగెత్తలేక, సరైన హిట్ కొట్టలేక తరుణ్ రేసు నుంచి తప్పించుకున్నట్టే కనిపిస్తోంది.

చివరగా అలా..
తరుణ్ చివరగా ఇది నా లవ్ స్టోరీ అనే చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ అది కూడా అంతగా వర్కవుట్ అవ్వలేదు. తరుణ్ తన అభిమానులను మళ్లీ నిరాశ పరిచాడు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చిన తరుణ్ ఇలా వెనుకపడిపోయాడేంటని అభిమానులు తెగ ఫీలవుతున్నారు.

అలా వైరల్..
నువ్వే కావాలి సినిమా వచ్చి 20 యేళ్లు అయిన సందర్భంగా తరుణ్ గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నాడు. అలా తరుణ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. తరుణ్ పిక్స్ చాలా రోజుల తరువాత అలా బయటకు వచ్చాయి. నువ్వే కావాలి సినిమా నాటి గుర్తులను తరుణ్ నెమరు వేసుకున్నాడు.

తరుణ్ బర్త్ డే..
తరుణ్ బర్త్ డే (జనవరి 8) సందర్భంగా నిన్న అంతా కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అయ్యాయి. హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల, అల్లరి నరేష్, సమీర్, శర్వానంద్ వంటి వారంతా తరుణ్‌కు స్పెషల్ విషెస్ అందించారు. అయితే తరుణ్ సినిమాలతో అలరించకపోయినా సీసీఎల్ అంటూ రచ్చ చేస్తుంటాడు. తన క్రికెట్ టీంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాడు.

స్పెషల్ పార్టీ..
తన సన్నిహితులకు మాత్రం నిన్న గ్రాండ్ పార్టీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. తరుణ్ బర్త్ డే సందర్భంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతన్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.

శ్రీకాంత్, రాజీవ్ అలా...
టాలీవుడ్ లవర్ బాయ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ తరుణ్‌కు హ్యాపీ బర్త్ డే.. నీకు మరిన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ రాజీవ్ కనకాల పోస్ట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే తరుణ్.. నీకు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలగాలని శ్రీకాంత్ పోస్ట్ చేశాడు.