యాక్సిడెంట్ వార్తలపై స్పందించిన తరుణ్.. ఫ్యాన్స్ ఆందోళన చెందవద్దంటున్న హీరో తండ్రి

తన కారుకు ప్రమాదం జరిగిందంటూ వస్తున్న వార్తలపై హీరో తరుణ్‌ స్పందించాడు. సోమవారం తెల్లవారుజామున నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తరుణ్‌కు గాయాలయ్యాయని, ప్రమాదం తర్వాత అతడు వేరే కారులో వెళ్లిపోయాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఓ మీడియా చానెల్‌తో స్పందించాడు.

ఈ సందర్భంగా తన యాక్సిడెంట్ వార్తలను ఖండించాడు. 'నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. యాక్సిడెంట్ అయిన కారుకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను రాత్రి నుంచి ఇంట్లోనే ఉన్నాను. నా కారు కూడా ఇక్కడే ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇదే విషయంపై తరుణ్ తండ్రి చక్రపాణి కూడా స్పందించారు. ఆయనను కొందరు మీడియా ప్రతినిధులు సంప్రదించగా.. 'నా కుమారుడు తరుణ్‌కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అభిమానులు ఆందోళన చెందవద్దు' అని కోరారు. దీంతో తరుణ్‌పై వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పడినట్లైంది.

Hero Tarun reaction about Car Accident

అయితే, ఈ ప్రమాదం జరిగింది తరుణ్‌కు కాదు.. మరో యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌కు అని ప్రచారం జరుగుతోంది. కొందరు రాజ్ తరుణ్‌ అని చెప్పడానికి బదులు తరుణ్ అని అనడంతో తప్పుడు వార్తలు వచ్చాయని అంటున్నారు. అసలు ఈ కారు ఎవరిది..? అనేది తెలియాల్సి ఉంది.

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరో తరుణ్.. కొన్నేళ్లుగా సరైన హిట్ పడక ఇబ్బందులు పడుతున్నాడు. గతేడాది 'ఇది నా లవ్ స్టోరీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఇది అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు పడుతున్నాడు. ఇటీవలే ఓ సినిమాకు ఓకే చెప్పాడని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X