For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా డబ్బంతా పెడతా, నీయమ్మ దెబ్బకు నెం.1... పెళ్లిచూపులు హీరో కామెంట్!

  By Bojja Kumar
  |

  'పెళ్లి చూపులు' చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ దశ తిరిగింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ త్వరలో 'అర్జున్ రెడ్డి' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

  'అర్జున్ రెడ్డి' ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఆకట్టుకోవడంతో పాటు తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సూపర్ గా ఉండటంతో సినిమాపై క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో విజయ్ దేవరకొండ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

  బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అంటూ కాన్ఫిడెన్స్

  బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అంటూ కాన్ఫిడెన్స్

  ‘అర్జున్ రెడ్డి' మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..... మా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని బల్లగుద్ది మరీ చెప్పాడు. ట్రైలర్ 3 నిమిషాలకు పైగా ఉన్నప్పటికీ ఇంకా కొన్ని సీన్లు ఉంటే బావుండు అని చాలా మంది ఫీలవుతున్నారని, సినిమా హిట్ అని చెప్పడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ అవసరం లేదన్నారు.

  కావాలంటే చాలెంజ్... నా డబ్బంతా పెడతాను

  కావాలంటే చాలెంజ్... నా డబ్బంతా పెడతాను

  ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాదని ఎవరైనా బెట్ కడితే.... నేను నా అకౌంట్లో ఉన్న డబ్బంతా బెట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదో బ్లడీ గుడ్ ఫిల్మ్, నటుడిగా పూర్తి సంతృప్తి చెందాను, అందుకే ఈ సినిమా హిట్టవుతుందని ఇంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను అని విజయ్ దేవరకొండ తెలిపారు.

  బాహుబలి కొన్న అతడే

  బాహుబలి కొన్న అతడే

  బాహుబలి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన సునీల్ నారంగ్ అన్ని డబ్బులు పెట్టి ‘అర్జున్ రెడ్డి' సినిమాను ఎందుకు తీసుకున్నాడు అని మా నాన్న అడిగారు. అపుడు నేను ఒకటే చెప్పాను సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకం ఆయనకు కలిగింది కాబట్టే అంత పెద్ద మొత్తం పెట్టారు అని.... విజయ్ దేవర కొండ తెలిపారు.

  హీరో నానికి ముద్దు

  హీరో నానికి ముద్దు

  అర్జున్ రెడ్డి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి హీరో నాని ముఖ్య అతిథిగా హాజరైన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నానికి విజయ్ దేవరకొండ ముద్దు పెట్టడం చర్చనీయాంశం అయింది. నాని నాకు ముందు నుండి ఎంతో సపోర్టుగా ఉన్నాడని, ఇలాంటి ఫ్రెండ్ దొరకడం తన అదృష్టమని తెలిపారు.

  దీన్నమ్మ దెబ్బకు నెం. 1

  దీన్నమ్మ దెబ్బకు నెం. 1

  ‘అర్జున్ రెడ్డి' ట్రైలర్ ఫేస్ బుక్ లో ట్రెండింగ్స్‌లో నెం.1 స్థానం దక్కించుకోవడంతో విజయ్ దేవరకొండ‌ ఆనందంతో ఓ పోస్టు పెట్టారు. దేర్ వి గో... నీయమ్మ దెబ్బకు నెం. 1, ఆగస్టు 25న వస్తున్నాం, అప్పటి వరకు ఇదే పరస్థితి, బ్లాక్ బస్టర్ హిట్టే అంటూ పోస్టు చేశారు.

  అర్జున్ రెడ్డి

  అర్జున్ రెడ్డి

  ‘అర్జున్ రెడ్డి' చిత్రాన్ని భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ పతాకంపై సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. హీరో విజ‌య్ దేవ‌ర కొండ ఈ చిత్రంలో యారోగెంట్ మెడిక‌ల్ స్టూడెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు.

  సునీల్ నారంగ్

  సునీల్ నారంగ్

  విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి 2 చిత్రాన్ని విడుద‌ల చేసిన ఏషియ‌న్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు.

  నటీనటులు

  నటీనటులు

  విజ‌య్ దేవ‌ర కొండ‌, షాలిని, జియా శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, క‌మ‌ల్ కామ‌రాజు, సంజ‌య్ స్వ‌రూప్‌, కాంచ‌న ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు.

  తెర వెనక

  తెర వెనక

  ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ః రాజ‌కృష్ణ‌న్‌, సౌండ్ డిజైన్ః సింక్ సినిమా, వి.ఎఫ్‌.ఎక్స్ః హ‌రికృష్ణ‌, సాహిత్యంః అనంత శ్రీరాం, రాంబాబు గోసాల‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కృష్ణ వ‌డ్డేప‌ల్లి, మ్యూజిక్ః ర‌ధ‌న్‌, కెమెరాః రాజ్ తోట‌, ఎడిటింగ్ః శ‌శాంక్‌, నిర్మాతః ప్ర‌ణ‌య్ వంగా, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః సందీప్‌రెడ్డి వంగా.

  అర్జున్ రెడ్డి ట్రైలర్

  అర్జున్ రెడ్డి ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. 3 నిమిషాలగా నిడివి ఉన్న ఈట్రైలర్ యూట్యూబ్, ఫేస్ బుక్ లలో కలిసి దాదాపు 3 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

  English summary
  Hero Vijay Deverakonda Super Confident Speech at Arjun Reddy Theatrical Trailer Launch. Arjun Reddy Telugu Movie ft. Vijay Devarakonda and Shalini Pandey. Music by Radhan. Directed by Sandeep Vanga & Produced by Pranay Reddy Vanga on Bhadrakali Pictures banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X