»   » విశాల్ నిర్ణయం "హీరోల" కన్ను తెరిపించేలా: ప్రతీ టికెట్ లో ఒక్క రూపాయి రైతుల కోసం

విశాల్ నిర్ణయం "హీరోల" కన్ను తెరిపించేలా: ప్రతీ టికెట్ లో ఒక్క రూపాయి రైతుల కోసం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన విశాల్‌ పై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తమిళ నిర్మాతల మండలి నూతన కార్యవర్గం గురువారం సాయంత్రం పదవీ స్వీకారం చేసింది. ఈనెల 2న చెన్నైలో జరిగిన ఎన్నికల్లో విశాల్‌ ప్యానెల్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే.

కోడం బాక్కంలో రజనీకాంత్‌కు చెందిన రాఘవేంద్ర కల్యాణ మండపంలో నూతన కార్య వర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.. అధ్యక్షుడు విశాల్‌తో 'పదినారు వయదినిలే' నిర్మాత రాజ్‌కన్ను, ఉపాధ్యక్షుడు గౌతమ్‌ మేననతో ఎస్‌ఏ చంద్రశేఖర్‌ పదవీ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు, దర్శకులు, ఇతర సినీ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.

Hero Vishal pitches for a united industry, relief for farmers

ఈ వేడుకలో పాల్గొన్న సినీయర్‌ నిర్మాతల చేతుల మీదుగా నూతన కార్యవర్గ సభ్యుల పదవీ స్వీకారం జరిగింది. అధ్యక్షుడు విశాల్‌తో 'పదినారు వయదినిలే' నిర్మాత రాజ్‌కన్ను, ఉపాధ్యక్షుడు గౌతమ్‌ మేననతో ఎస్‌ఏ చంద్రశేఖర్‌ పదవీ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు, దర్శకులు, ఇతర సినీ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.

రాష్ట్రంలో తీవ్ర కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు నిర్మాతల సంఘం నూతన కార్యవర్గం బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. సినిమా టిక్కెట్‌ ధరలో నిర్మాతల వంతుగా ఒక రూపాయి రైతులకు అందించనుంది. అంటే తమిళనాడులో ప్రదర్శిత మయ్యే అన్ని సినిమాలకు ఏదో ఒకరోజు ప్రతి టిక్కెట్‌పై ఒక రూపాయిని రైతు నిధికి కేటాయిస్తారు. ఆ తేదీని త్వరలో ప్రకటిస్తామని, తద్వారా ఎన్ని కోట్లు వచ్చినా అంతా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకి ఇస్తామని విశాల్‌ చెప్పటం అంతటా ప్రశంసలు పొందుతోంది.

English summary
“To help the farmers from Tamil Nadu who have been affected, the council has decided that one rupee from every ticket for a Tamil movie sold on one day in the State will go towards creating a fund for them. We will zero in on the date soon,” Vishal said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu