»   » హీరోయిన్ రమ్య: వెండితెర నుంచి లోక్‌సభకు(ఫోటో ఫీచర్)

హీరోయిన్ రమ్య: వెండితెర నుంచి లోక్‌సభకు(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : దివ్య స్పందన అలియాస్‌ రమ్య- మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌. తలపండిన రాజకీయ వేత్తలు, విశ్లేషకులు సైతం వూహించని విధంగా ఒక కన్నడ యువనటి సంచలనం సృష్టించారు. మండ్య జిల్లా ఓటర్లు ఆమెకు పట్టం కట్టారు. లోక్‌సభ ఉప ఎన్నికలో ఘనవిజయాన్ని అందించారు. దేశంలో అత్యంత చిన్న వయస్సున్న లోక్‌సభ సభ్యురాలిగా ప్రత్యేక గుర్తింపు ఆమె సొంతం.

జేడీఎస్‌ కంచుకోట బద్ధలైంది. అందులో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరేసింది. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు ఈ నెల 21న జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయదుందుభి మోగించింది. జేడీఎస్‌ ఓట్ల బ్యాంకుగా నమ్మిన ఒక్కలిగలు అత్యధికంగా ఉండే ఆ రెండు చోట్లా పార్టీ అభ్యర్థులు పరాభవం పాలవటం దళపతి దేవెగౌడకు పిడుగుపాటైంది. శనివారం వెల్లడైన ఎన్నికల ఫలితాలు పార్టీలో ప్రకంపనల్ని రేపింది. మండ్యలో పుట్టస్వామి, బెంగళూరు రూరల్‌లో దేవెగౌడ కోడలు అనితా కుమారస్వామి మట్టికరిచారు. ఓటమి నిర్వేదంతో... అనిత భర్త, జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి పార్టీ పదవితో పాటు శాసనసభలో జేడీ ఎల్పీ అధ్యక్ష స్థానాన్నీ త్యజిస్తానని శనివారమే ప్రకటించారు.

మండ్య అభ్యర్థి కోసం అంతటా వెదికారు. మాజీ ఎమ్మెల్యేలు ఎల్‌.ఆర్‌.శివరామేగౌడ, డాక్టర్‌ ప్రేమచంద్ర సాగర్‌ పేర్లు వినిపించాయి. మండ్య జిల్లాల్లో మంత్రి అంబరీశ్‌, ఎస్‌ఎం కృష్ణ మధ్య సయోధ్య ఏర్పాటయ్యేలా నటి రమ్యను బరిలోకి దించింది. సినీ నటి కావటంతో అంబరీశ్‌ ఆమెకు అండగా నిలిచారు. ఎస్‌.ఎం.కృష్ణ ఆత్మీయుడు దివంగత ఆర్‌.టి.నారాయణ్‌ పెంపుడు కూతురు కావటంతో ఆయన రమ్య గెలుపునకు కృషి చేశారు. ఎన్నికల ప్రచారంలో జేడీఎస్‌ నాయకులు రమ్య జననం, కులాల గురించి ప్రస్తావించటం రాద్ధాంతంగా మారింది.

మిగతా విశ్లేషణ...స్లైడ్ షో లో...

పెంపుడు తండ్రే అంతా..

పెంపుడు తండ్రే అంతా..

మండ్య జిల్లాలో 1982 నవంబరు 29న జన్మించిన దివ్య స్పందన బాల్యం బెంగళూరులో గడిచింది. తల్లి రంజిత ఆమెను వూటీలోని సెయింట్‌ హిల్డాస్‌ స్కూల్‌లో చేర్పించారు. తండ్రి దూరం కావడంతో పెంపుడు తండ్రి ఆర్‌.టి.నారాయణ్‌ అన్నీ తానై అండగా నిలిచారు.

చదవు ఆపి సినిమాల్లోకి..

చదవు ఆపి సినిమాల్లోకి..


వూటీ, చెన్నైలోని సేక్రెడ్‌ హార్ట్‌ స్కూల్‌లో ప్రాథమిక, ఉన్నత విద్యను అభ్యసించింది. అనంతరం బెంగళూరులోని సెయింట్‌ జోసెఫ్‌ కళాశాలలో బి.కాం చేరింది. డిగ్రీ చదువును సగంలోనే ఆపేయాల్సి వచ్చింది. అదే సమయంలోనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

పునీత్ సరసన మొదట..

పునీత్ సరసన మొదట..

రమ్య 2003లో చిత్ర పరిశ్రమలో ప్రవేశించింది. పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌కు జంటగా అభి సినిమాలో నటించింది. అంతకుమునుపే నినగాగి సినిమాలో అవకాశం వచ్చినా చివరి నిముషంలో చేజారిపోయింది. 'అప్పు' సినిమాలో హీరోయిన్ కోసం యత్నించినా అక్కడా నిరాశే ఎదురైంది. అభి సినిమా తరువాత అవకాశాలు ఒకదాని వెంట ఒకటిగా వెతుక్కుంటూ వచ్చాయి.

నిర్మాతల ఎదురు చూపు..

నిర్మాతల ఎదురు చూపు..

ఇప్పటి వరకు 38 సినిమాల్లో నటించింది. మరో ఆరు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. రమ్య అందచందాలు, అభినయం యువ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఆమె నృత్యాలు ఉర్రూతలూగిస్తాయి. ఆమె కాల్షీట్ల కోసం నిర్మాతలు ఎదురుచూసేవారు.

ప్రేమలో...

ప్రేమలో...

ఆమె వృత్తి, ప్రవృత్తి నటనే. కానీ రెండేళ్లలో ఒకదానివెంట ఒకటిగా చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని రమ్య రెండేళ్ల క్రితం యువజన కాంగ్రెస్‌లో చేరడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ సమయంలోనే పోర్చుగీస్‌ యువకుడు రాఫెల్‌తో ప్రేమలో పడింది. ఐపిఎల్‌ మ్యాచ్‌లను కలిసి వీక్షించారు. వచ్చే ఏడాది వివాహం చేసుకోనున్నారనే ప్రచారం జరిగినా ఇద్దరూ వేరుపడ్డారు.

రాజకీయాల్లోకి అడుగు

రాజకీయాల్లోకి అడుగు

ఆ తరువాత బెంగళూరులోని శాంతినగర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్‌లో సభ్యత్వాన్ని స్వీకరించింది. నగరంలో జరిగిన కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ సభలో పాల్గొంది. అప్పట్లో ఆమె రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టడడం ఖాయమంటూ వార్తలు గుప్పుమన్నా, అవి వాస్తవం కాలేదు. ఆమెను లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నుంచి బరిలోకి దించాలని కొందరు కాంగ్రెస్‌ నాయకులు పావులు కదిపారు. ఈ పరిణామాలతో సంబంధం లేకుండా సినీ రంగంపైనే దృష్టి సారించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల ఒత్తిళ్ల కారణంగా చివరి దశలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంది.

సుదీప్,ఉపేంద్రకే ఇబ్బంది

సుదీప్,ఉపేంద్రకే ఇబ్బంది

ఎలక్షన్స్ లో నిలబడి, విజయం సాధించిన రమ్య..పొలిటకల్ లైఫ్ లో సెటిల్ అయిపోతే ఆమె మిత్రులు ఉపేంద్ర,సుదీప్ ల ప్రక్కన మంచి హీరోయిన్ కోల్పోయినట్లు అవుతుందని ఆమె అభిమానులు అంటున్నారు. కన్నడ పరిశ్రమలో ఆమెకు క్లోజ్ ప్రెండ్స్ వీరిద్దరే.

తండ్రి మరణం..

తండ్రి మరణం..

నామినేషన్‌ వేసిన కొన్ని నిమిషాల్లోనే ఆమె పెంపుడు తండ్రి ఆర్‌.టి.నారాయణ్‌ గుండెపోటుతో మరణించారు. ఆమె పోటీలో కొనసాగుతారా? అనే సందేహాలు వచ్చాయి. ప్రత్యర్థులు ఆమెను 'టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ' అంటూ ఎద్దేవా చేసినా, ఎన్నో వ్యాఖ్యలతో ఎగతాళి చేసినా చలించలేదు. విమర్శల్ని మౌనంగా ఎదుర్కొంది. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొంది. ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. లోక్‌సభలో అడుగుపెడుతోంది.

బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్‌కు సవాల్‌గా మారింది. గృహనిర్మాణశాఖ మంత్రి అంబరీష్‌, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.ఎం.కృష్ణ వర్గాల నడుమ నెలకొన్న వైషమ్యాల కారణంగా ఇద్దరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా రమ్య తెరమీదకొచ్చింది.

అంతర్గత కలహాలే ప్లస్..

అంతర్గత కలహాలే ప్లస్..

భాజపాతో జేడీఎస్‌ కుదుర్చుకున్న పొత్తు ఫలించలేదు. పైగా వికటించింది. పొత్తు కుదిరినట్లు కుమారస్వామి బహిరంగంగా ప్రకటించగా అదే స్థాయిలో దేవేగౌడ పొత్తు లేదని ప్రచారం చేశారు. ఇదేమి విడ్డూరం అని ఓటర్లు భావించారు. మండ్య జిల్లాలోని అంతర్గత కలహాలు జేడీఎస్‌ను దెబ్బతీశాయి. గత విధానసభ ఎన్నికల్లో కనీసం ఐదుగురు జెడీఎస్‌ అభ్యర్థుల పరాజయానికి పుట్టరాజు కృషి చేసినట్లు ఆరోపణలున్నాయి. వారంతా చెలువరాయస్వామి వర్గీయులు. వీరు పుట్టరాజు ఓటమికి కృషిచేశారు. ఇవన్నీ రమ్య గెలుపునకు కలసి వచ్చాయి.

ఈ విజయం మా తండ్రికే అంకితం

ఈ విజయం మా తండ్రికే అంకితం

మండ్య ప్రజల రుణం తీర్చుకోలేనిదని నామినేషన్ వేసిన రోజునే తన తండ్రి గుండెపోటుతో మరణించినప్పటికీ ప్రజలంతా బిడ్డలా ఆశీర్వదించి మద్దతిచ్చారని సినీ నటి రమ్య పేర్కొన్నారు. కర్నాటకలోని మండ్య స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా తన గెలుపును తండ్రికి అంకితం చేస్తున్నానని ఆమె వెల్లడించారు.

సంబరాలు

సంబరాలు

ఫలితాల వెల్లడి తర్వాత శనివారం రాత్రి కేపీసీసీ కార్యాలయానికి వచ్చిన ఆమెను కేపీసీసీ అధ్యక్షుడు డా.జి.పరమేశ్వర్‌తోపాటు పలువురు నేతలు, మహిళా నాయకురాళ్లు ఘనంగా సత్కరించారు. సుమారు గంటన్నరపాటు కేపీసీసీలో సంబరాలు సాగాయి.
అనంతరం రమ్య మాట్లాడుతూ తన గెలుపు సీఎం సిద్దరామయ్య, పరమేశ్వర్‌లతోపాటు మంత్రులు, నాయకులు, కార్యకర్తలు కలసి సాధించిన విజయమని కొనియాడారు.

సోనియా ప్రశంసించారు

సోనియా ప్రశంసించారు

ఉప ఎన్నికలలో రెండు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు అనూహ్యమైన మెజారిటీతో గెలుపొందడంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రత్యేకంగా ప్రశంసించారని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ వెల్లడించా రు. శనివారం రాత్రి కేపీసీసీలో ఎంపీ ర మ్యను అభినందించిన సమయంలో కా సేపు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. మైసూరులో, బెంగళూరులో తమకు తిరుగులేదని భావించే జేడీఎస్‌కు ప్రజ లు తగిన గుణపాఠం చెప్పారని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రజలు వారికిచ్చిన తీర్పు వెన్నెముకను విరిచినట్లు ఉందన్నారు. తండ్రి మృతి చెందినా వె నుదిరగని రమ్య ఓ శక్తిలా రాజకీయ అ రంగేట్రం చేసిందని కొనియాడారు.

English summary

 Film heroine Divya Spandana aka Ramya won Mandya by-polls. Divya who contested the by-elections on Congress Party ticket defeated JD(S) candidate C S Puttaraju by 47,000 votes. She filed nomination just in nick of time on Saturday. She thanked all her supporters. Divya became the youngest female MP in India in the process.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu