Don't Miss!
- News
కుప్పంలో ఓడిపోతాం - ఇదీ కారణం : లోకేష్ కు కార్యకర్త షాక్..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Finance
Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
నందమూరి హీరో సినిమా.. హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల
తెలుగు సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల కాలం నడుస్తోంది. ఇప్పుటికే తెలుగు చిత్ర సీమలో ఎన్నో జీవిత చరిత్రలు సినిమాలుగా వచ్చాయి. వాటిలో చాలా వరకు భారీ విజయాలను సొంతం చేసుకోగా.. మరికొన్ని మాత్రం విఫలమయ్యాయి. ఈ ఊపులోనే మరో బయోపిక్ తెరకెక్కుతోంది. 1980 దశకంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. 'దేవినేని' అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు 'బెజవాడ సింహం' అనే ఉప శీర్షిక పెట్టారు.
నందమూరి తారకరత్న టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాను ఆర్‌టీఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాను నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఇందులో వంగవీటి రంగా పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ పాత్రనూ హైలైట్ చేయబోతున్నారు. రంగా పాత్రలో ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన దేవినేని లుక్, వంగవీటి లుక్‌కు భారీ స్పందన వచ్చింది. ఈ రెండు పాత్రల్లో తారకరత్న, సురేష్ కొండేటి సరిగ్గా సరిపోయారన్న టాక్ వచ్చింది.

దీంతో తాజాగా మరో లుక్‌ను వదిలింది చిత్ర బృందం. ఈ సినిమాలో వంగవీటి రంగా భార్య రత్నకుమారిగా నటించిన తమిళనటి ధృవతారకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. ఇందులో సురేష్ కొడేటి రంగాగా కనిపించగా, ధృవతార రత్నకుమారిలా దర్శనమిచ్చింది. ఈ పోస్టర్‌కు కూడా మంచి స్పందనే వస్తోంది. వాస్తవానికి ఈ సినిమాలో రత్నకుమారి పాత్రకు అత్యధిక ప్రాధాన్యమించ్చారట దర్శకుడు శివనాగు. అందుకే ఆమెకు సంబంధించిన ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేశారని తెలుస్తోంది.
ఈ సినిమాలో దేవినేని పాత్ర హైలైట్ అయినప్పటికీ.. వంగవీటి రంగాకు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చామని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇద్దరు ఉద్దండుల మధ్య స్నేహం, రాజకీయాలు, వివాదాలు తదితర అంశాలు చూపించారట. ఈ సినిమాలో వంగవీటి రాధాగా బెనర్జీ, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.