For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇది చూడగానే నన్ను బండబూతులు తిడతారని తెలుసు.. అయినా సరే! హీరోయిన్ షాకింగ్ పోస్ట్

  |

  ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో సంచలనాలకు తెరలేపే వ్యక్తుల్లో సినీనటి, రాజకీయవేత్త మాధవీలత ఒకరు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు జనం నోళ్ళలో నానే అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయం నిర్మొహమాటంగా చెబుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కరోనా ఎఫెక్ట్ కారణంగా దేశంలో జరుగుతున్న పరిణామాలు, పోలీసుల తీరుపై స్పందించి సంచలనం సృష్టించింది మాధవీలత. వివరాల్లోకి పోతే..

  కరోనా కలకలం.. దేశమంతా లాక్‌డౌన్

  కరోనా కలకలం.. దేశమంతా లాక్‌డౌన్

  కరోనా వైరస్ విజృంభణ చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే పరిష్కారమని భావించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఏ ఒక్కరూ ఇంటినుంచి బయటకు రావొద్దని ఆంక్షలు విధించాయి.

  డ్యూటీలో ఉన్న పోలీసులు.. తెలంగాణా సీఎం

  డ్యూటీలో ఉన్న పోలీసులు.. తెలంగాణా సీఎం

  అయినా కొందరు మాత్రం ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దయచేసి బయటకు రావద్దంటూ డ్యూటీలో ఉన్న పోలీసులు ఎంత వేడుకున్నా వినడం లేదు. జనం ఇలా మాట వినకపోవడం, వద్దన్నా స్వేచ్ఛగా బయట తిరుగుతుండటం చూసి తెలంగాణా సీఎం కేసీఆర్ సైతం.. ఎవ్వరూ బయటకు రావొద్దంటూ చేతులెత్తి మొక్కారు.

  లాఠీకి పనిచెప్పిన పోలీసులు.. అందరూ మిక్స్

  లాఠీకి పనిచెప్పిన పోలీసులు.. అందరూ మిక్స్

  అయినప్పటికీ ఆ సూచనలను పక్కనపెట్టి రోడ్లపై తిరుగుతున్నారు జనం. దీంతో, ఇలా కాదని తమ లాఠీకి పనిచెప్పారు పోలీసులు. ఎందుకొచ్చారు? సందర్భం ఏంటనేది కూడా తెలుసుకోకుండా రోడ్లపైకి వచ్చిన వారిని లాఠీలతో బాదుతున్నారు. ఇందులో అత్యవసర పరిస్థితుల్లో వచ్చినవారు, టైమ్ పాస్ రాయుళ్లు అందరూ మిక్స్ అవుతున్నారు. ఇలా జనాన్ని పోలీసులు బాదుతున్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  నన్ను బండబూతులు తిడతారని తెలుసు..

  నన్ను బండబూతులు తిడతారని తెలుసు..

  ఈ విషయమై స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేసింది మాధవీలత. బ్లడీ స్టుపిడ్ పోలీస్.. సైకోల్లా బిహేవ్ చేతున్నారంటూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నేను ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల జనం నన్ను బండబూతులు తిడతారని తెలుసు.. రండి తిట్టండి అంటూ పిలుపునిచ్చి మరీ పోలీసుల తీరుపై విరుచుకుపడింది మాధవీలత.

  బ్లడీ స్టుపిడ్ పోలీస్.. వాళ్లు కూడా మనుషులే..

  బ్లడీ స్టుపిడ్ పోలీస్.. వాళ్లు కూడా మనుషులే..

  పోలీసులు ప్రజల్ని వీర బాదుడు బాదుతున్న వీడియోలను పోస్ట్ చేసిన మాధవీలత.. ‘కమాన్, మైడియర్ సోషల్ మీడియా హీరోస్.. నీఛమైన కామెంట్స్‌తో నన్ను ఎటాక్ చేయడానికి గెట్ రెడీ' అంటూ మొదలు పెట్టి.. ‘కారణం తెలుసుకోవాలి.. అతిక్రమిస్తే కేసులు పెట్టమన్నారు. ఇలా కొట్టమననేదు.. బ్లడీ స్టుపిడ్ పోలీస్ (కొందరు మాత్రమే).. మీరు డ్యూటీ చేస్తున్నారు ఓకే. వాళ్లు కూడా మనుషులే.. మీరు మనుషుల్లా ప్రవర్తించండి. బయటకు వస్తున్న ప్రజలంతా తప్పు చేస్తున్నట్టు కాదు. కారణం లేకుండా బయటకు రారు. ఒకవేళ వస్తే ఇలా దారుణంగా కొట్టే బదులు వారికి జరిమానా విధించండి. వాళ్లు చేసిన తప్పుకు జరినామా సరిపోతుంది. ఇలా సైకోల్లా ప్రవర్తించాల్సిన అవసరం లేదు' అంటూ రెచ్చిపోయింది.

  అనుకున్నట్లుగానే బండబూతులు.. కానీ కొందరు!

  అనుకున్నట్లుగానే బండబూతులు.. కానీ కొందరు!

  మాధవీలత చేసిన ఈ కామెంట్స్ చూసి నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు మాధవీలత చెప్పినట్లుగానే ఆమెను బండబూతులు తిడితే, ఇంకొందరు మాత్రం మాధవీలత చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని అంటున్నారు. కొందరికి అత్యవసర పరిథితులు ఉంటాయి. సాటి మనిషిగా ఆలోచించాలి అంటూ రియాక్ట్ అవుతున్నారు.

  ఇస్తినమ్మ వాయనం తీసుకుంటినమ్మ వాయనం

  గతంలో కూడా ఇదే కరోనా ఇష్యూపై స్పందిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ మధ్యలో ‘పారాసిటమాల్' గోలీ పెట్టి రచ్చ చేసింది మాధవీలత. ఈ ఫోటోను తన ఫేస్‌బుక్ లో షేర్ చేస్తూ ''ఇస్తినమ్మ వాయనం తీసుకుంటినమ్మ వాయనం'' అని కామెంట్స్ చేసింది.

  English summary
  World wide people fears on Coronavirus issues. Two states cms's K. Chandrashekar Rao, Y. S. Jaganmohan Reddy strictly orders all the people stay at home. In this issue now Madhavi Latha reacted.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X