twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ హీరోయిన్ నీ టార్గెట్ చేయటం లేదంటూ డైరక్టర్ వివరణ

    By Srikanya
    |

    ముంబై : ''ఇది సినిమా పరిశ్రమకు చెందిన కథే. అయితే ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదు. కొన్ని వాస్తవిక పరిస్థితులను చూపిస్తున్నాం. సినిమా పరిశ్రమ ఎలా ఉంటుందో ఓ పాత్రికేయుడిగా చెబుతున్నానంతే. మీరనుకొంటున్నట్టు ఇది హీరోయిన్ జీవిత చరిత్ర కాదు. బహుశా.. హీరోయిన్స్ లో చాలామంది జీవితాలు 'హీరోయిన్‌'లోని కరీనా కపూర్‌ పాత్రలానే ఉంటాయి అని వివరించాడు మధూర్ బండార్కర్. ఆయన తాజా చిత్రం 'హీరోయిన్‌' గురించి చెప్పుకొచ్చారు.

    'హీరోయిన్‌' సినిమాలో ఏ హీరోయిన్ ను లక్ష్యం చేసుకొన్నారు? ఎవరి జీవితానుభవాల్ని చూపించబోతున్నారు? బాలీవుడ్‌లో ఆ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ రెండు ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. దర్శకుడు మధుర్‌ బండార్కర్‌ దానికి సమాధానం ఇచ్చారు. అలాగే హీరో కోణంలోంచి మంచి కథ దొరికితే దాన్ని కూడా తెరకెక్కిస్తానేమో? ఒక్క మాట చెప్పగలను.. కరీనా ఈ సినిమాతో నటిగా మరో మెట్టుపైకి ఎక్కుతుంది'' అన్నారు.

    ఇక ఈ చిత్రం మనీషా కొయరాలా జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేస్తున్నారంటూ వచ్చిన వార్త లు వస్తున్నాయి. మధూర్ బండార్కర్ దర్శకత్వంలో కరీనాకపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హీరోయిన్ చిత్రం మనీషా జీవిత చరిత్ర ఆధారంగానే అని వినపడుతోంది. 1990-2005 ల మధ్య జరిగిన ఆమె జీవత ఎత్తు పల్లాలను సినిమాలో చూపిస్తాడని చెప్పుకుంటున్నారు.

    అలాగే ఆమె ఆల్కహాల్ కు బానిస అవ్వటం,ఓ వెలుగు వెలిగిన ఆమె జీవితం ఇలా ఇబ్బందికరంగా తయారవటం ప్రధానాంశాలు అంటున్నారు. అలాగే సెకండాఫ్ లో ఆమె వివాహ జీవితం ఫెయిల్యూర్ అవ్వటం కూడా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే ఆ విషయాన్ని దర్శకుడు మధూర్ ఖండిస్తున్నాడు. నో..నో..నా చిత్రం ప్రత్యేకంగా ఎవరి జీవితాన్ని ఉద్దేశించి కాదు అంటున్నాడు. ఇక రీసెంట్ గా మనీషా కొయరాల తాగి ఓ పంక్షన్ కి వెళ్లి మీడియా కళ్లల్లో పడిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో తల్లి పాత్రలకు ట్రై చేస్తోంది.

    English summary
    "'Heroine' is not inspired by any one person. The movie is about Mahi (Kareena) and her journey towards stardom and the ups and downs that come with it," he said. "I am not saying it is not inspired by Hollywood or Bollywood, there is inspiration. I would say that 70 percent of it is realistic and 30 percent fiction. It is difficult to pin point one person on whom the movie is based," says Madhur Bhandarkar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X