»   » నారా రోహిత్ హీరోయిన్ క్షమాపణలు చెప్తూ ...(వీడియో)

నారా రోహిత్ హీరోయిన్ క్షమాపణలు చెప్తూ ...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కిస్ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన ప్రియ బెనర్జీ ఇప్పుడు నారా రోహిత్ సరసన అసుర చిత్రంలో చేస్తోంది. స్పెసీగా ఉండే ఈ ఎన్నారై రీసెంట్ గ జరిగిన అసుర ఆడియో పంక్షన్ కు హాజరు కాలేదు. ఈ సందర్భంగా ఆమె తన అభిమానులకు క్షమాపణ చెప్తూ వీడియోని విడుదల చేసింది. మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేసి, ఆమె క్షమాపణలు అందుకోండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుప్రియా బెనర్జీ మాట్లాడుతూ..." నేను నా అసుర టీమ్ కు..అభిమానులకు ఆడియో లాంచ్ కు రానందకు క్షమాపణలు చెప్తున్నాను.. కొన్ని వ్యక్తిగత పనుల వల్ల నేను కెనడాలో స్టక్ అయ్యిపోయాను. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. ", అన్నారామె.


అలాగే..."నారా రోహిత్...మంచి కో యాక్టర్, డౌన్ టు ఎర్త్ ఉండే వ్యక్తిత్వం గల అతినితో పనిచేయటం చాలా సులభం..నేను నా ప్రేమను, సపోర్ట్ ను..పంపుతూ.కంగ్రాట్స్ చెప్తూన్నా"...అంటూ ప్లయింగ్ కిస్ వదిలారామె.


చిత్రం విషయానికి వస్తే..


నారా రోహిత్ ...నటిస్తున్న సినిమా ‘అసుర'. ‘గుడ్ ఈజ్ బ్యాడ్' అనేది కాప్షన్. నేడు ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదలయ్యింది. టైటిల్లో కొత్తదనంతో పాటు మోషన్ పోస్టర్ తో సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని రేపారు. ఈ సినిమాలో రోహిత్ జైలర్ గా నటించారు. ఒక రాక్షసుడి పేరును హీరోకి పెట్టడమే ఆసక్తి కలగడానికి కారణం.


Heroine Priya Banerjee apologises to fans!!

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, డిఫరెంట్ కథతో ‘అసుర' సినిమా ఉంటుంది. నా కేరక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. చాలా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సాంగ్స్ షూటింగ్ బాలన్స్ ఉంది. కమర్షియల్ హంగులతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అని నారా రోహిత్ తెలిపారు.


కృష్ణ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా బెనర్జీ హీరోయిన్. జేమ్స్ మధు, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. నారా రోహిత్ సమర్పణలో శ్యామ్ దేవభక్తుని ఈ సినిమాను నిర్మించారు. 

English summary
“I’m apologising to my great team of Asura and all the fans out there that I’m not there at audio launch. Due to some personal work, I’ve got struck in Canada and will soon meet you”, said Priya Banerjee. Now Priya Banerjee became Nara Rohit’s heroine for upcoming “Asura”. However she failed to attend the movie’s audio launch.
Please Wait while comments are loading...