»   » బాలకృష్ణ సినిమా అందుకే రిజెక్టు చేసా

బాలకృష్ణ సినిమా అందుకే రిజెక్టు చేసా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ లాంటి పెద్ద హీరో సినిమాలో హీరోయిన్ గా అవకాశం వస్తే ఎందుకు రిజెక్టు చేసారు అని ఓ లీడింగ్ మీడియా వారు మమతా మోహన్ దాస్ ని అడిగారు. దానికి సమాధానంగా మమతా నేను ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా చేయలేను. నాలో సగం టాలెంట్ ఉన్నవాళ్లు కూడా ఇక్కడ పెద్దగా ఎదుగుతున్నారు. అలాంటప్పుడు నేనెందుకు రాజీ పడి చెయ్యాలి. స్క్రిప్టులో తప్పనిసరిగా మరో హీరోయిన్ కి ప్రాధాన్యత ఉందంటనే అటువంటి చిత్రాలు ఒప్పుకుంటాను. నేను ఓ నటిగా నన్ను నేను గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళదలిచాను. అయినా ప్రస్తుతం నా చేతిలో నాలుగు మళయాళ చిత్రాలు ఉన్నాయి. నాగార్జునతో చేస్తున్న కేడీ రిలీజయ్యాకే నా తర్వాత చిత్రం కమిట్ అవుదామని ఉంది. ఎందుకంటే ఆ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక పాటలు పాడటం తగ్గించేసారు అని అంతా అడుగుతున్నారు. అయితే నేను ప్రస్తుతం నటనకే ప్రయారిటీ ఇవ్వదలిచాను. రెండు పడవలమీద కాళ్లు పెట్టడం కష్టం. నటనలో ఖాళీ దొరికితేనే పాడగలను.అలాగే ఇక్కడ దర్శన, నిర్మాతలకు అందుబాటులో ఉండేందుకు అనువుగా హైదరాబాద్ షిప్ట్ అవుదామనుకుంటున్నాను. ఇక ఆమెను బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రెడీ అవుతున్న సింహా చిత్రం కోసం అడిగిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో ఇప్పటికే హీరోయిన్స్ గా నమిత, నయనతార ఉన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X