»   » నన్ను అలా పిలవొద్దు: ఆసిన్‌

నన్ను అలా పిలవొద్దు: ఆసిన్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నన్ను సహాయనటి అని పిలవొద్దు అంటూ అసిన్ గట్టిగా చెప్తోంది. హీరోయిన్‌ను గాని వేరే ఇతర నటి ఎవరైనప్పటికీ మగవాళ్ల చుట్టూ తిరిగే ఇతివృత్తం కల సినిమాలలో సహాయ నటి అని చెప్పటం అన్యాయమని బహుభాషా చిత్రాల నటి ఆసిన్‌ అన్నారు. ''చిత్రంలో ఎవరూ కూడా సహాయనటీమణులుంటారని అనుకోను. సినిమాలో మహిళాపాత్రలుండాల్సిందే. వారే ఆ పాత్రలు చేయగలరు. అందువల్ల ఇక్కడ సహాయనటి లేదా సహాయపాత్ర అని చెప్పటం అన్యాయం.''అని ఆమె చెప్పారు.

దక్షిణాదిలో పేరు తెచ్చుకున్న తరువాత 'గజిని'తో ఆమె 2008లో హిందీచిత్రరంగ ప్రవేశం చేశారు. అప్పటినుంచి పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. 'రెడీ', 'బోల్‌ బచ్చన్‌' ' హౌస్‌ఫుల్‌2' లాంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ''నాకు ఇచ్చిన పాత్రలతో సంతృప్తి చెందానని భావిస్తున్నా. ఉత్తరాది, దక్షిణాదిలలో వేర్వేరు రకాల హీరోయిన్‌లు ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇరు వర్గాలను మెప్పించటం తేలిక కాదు. అలా అయితే అందరు నటీమణులు చేసి ఉండేవారే'' అని అన్నారు.

తన చిత్రాలలో కొన్ని విజయవంతం కాకపోయినప్పటికీ తాను ఎలా ఉండాలో ఆసిన్‌కు తెలుసు. ''నేను నటించిన చిత్రాలలో కేవలం రెంటిలో మాత్రమే సరిగ్గా సరిపోయిన మొత్తం తారాగణం ఉంది. ఆ చిత్రాలలో నటించినందుకు గర్విస్తున్నాను. పలు తారలతో వృత్తిపరమైన సంబంధాలు ఏర్పరచుకున్నాను. ఇంకా మంచి చిత్రాలు నాకోసం ఉన్నాయని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

అసిన్‌ నటించిన హిందీ చిత్రాలలో చాలావరకు విజయవంతమయ్యాయి. ఈ సంగతి ప్రస్తావించగా ఆమె నవ్వి ఊరుకున్నారు. కేవలం తాను ఒక చిత్రంలో ఉన్నంత మాత్రాన అది విజయవంతమవుతుందని గ్యారంటీ లేదన్నారు. దేవుడి దయవల్ల తాను నటించిన చిత్రాలు అన్నీ విజయవంతమయ్యాయన్నారు. ''కాని నాకు ముందే ఏర్పరచుకున్న సూత్రం అంటూ ఏదీ లేదు. నాకు ఇష్టమైన జట్టుతో కలసి పనిచేస్తాను. బహుశా ఇదే విజయసూత్రం అనుకుంటాను. అందరికీ ఆమోదయోగ్యమైన హాస్యం ఉన్న స్క్రిప్టులనే ఎంచుకుంటాను'' అని చెప్పారు.

అక్షయ్‌ కుమార్‌తో ఆసిన్‌ నటించిన 'ఖిలాడీ 786' డిసెంబర్‌ 7న విడుదలవుతోంది. అక్షయ్‌తో నటించటం ఆమెకు ఇది రెండవ చిత్రం. ఆయనతో సత్సంబంధాలున్నాయని ఆమె చెప్పారు. ఈ చిత్రంలో మరాఠీ యువతి పాత్రను ఆమె పోషిస్తున్నారు. ఇది సున్నితమైన పాత్ర కాదని కాస్త కఠినంగానే ఉంటుందని ఆత్మవిశ్వాసం అధికమని చివరకు ప్రేక్షకులు హాస్యాన్ని రుచి చూస్తారని చెప్పారు.

English summary
Asin says it is unfair to simply call a female lead as a prop in a male-oriented film. Defen-ding her stand, the actor says, “I don’t think anybody is a prop (in a film). You need a female protagonist, a heroine, and only she can do the role. So it is not fair to call anybody a prop.”
Please Wait while comments are loading...