»   » అగ్గది అదీ మెగాస్టార్ పవరంటే...మెగాస్టారా మజాకా...

అగ్గది అదీ మెగాస్టార్ పవరంటే...మెగాస్టారా మజాకా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి సినీ స్టామినాకి ఇప్పటికి, ఎప్పటికీ డోకా లేదు. రాజకీయ అరంగేట్రం చేసి సంవత్సరం దాటినా సినీ ప్రస్థానంలో ఇంకా తానే 'నెంవర్ వన్" గా చెక్కు చెదరకుండా వెలుగొందుతున్నారు. అలాంటి హీరో మళ్లీ తన 150వ చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు అంటే ఎవరికి మాత్రం ఆతృత కలగకుండా ఉంటుంది. ఒక పక్క దర్శకులు తామంటే తామని చిరు చిత్రం కోసం ఎగబడుతుంటే, మరో పక్క మన దక్షిణాది నటీమణులు కూడా చిరు సరసన నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

ముఖ్యంగా అందాల బొమ్మాళీ అనుష్క లాంటి అందగత్తె పబ్లిక్ గానే స్టేట్ మెంట్స్ దంచేస్తుంటే త్రిష, అసిన్ లాంటి వాళ్లుతెర వెనుక నుండి తమ ప్రయత్నాల్లో నిమగ్నం అయ్యారు. లావు తగ్గి స్లిమ్ లుక్ కోసం, అలాగే డాన్స్ ల్లో పూర్వ వైభవం కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్న చిరుకు ఇంతటి క్రేజ్ ఉండటం గొప్ప విషయం కాకపోయినా, అభిమానుల కోసం మాత్రమే చేస్తున్న ఈ చిత్రం కోసం ఇంతమంది అందగత్తెలు క్యూ కట్టి మరీ నిల్చోవడం విడ్డూరమే. మెగా సినిమా పై రోజు రోజుకు వస్తున్న వార్తలు విని ఇదీ మా మెగా పవర్ అంటే..అటూ మెగాభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu