»   » వెంకీ, వరుణ్ తేజ్‌కు హీరోయిన్లు సెట్ చేసిన దర్శకుడు.. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్!

వెంకీ, వరుణ్ తేజ్‌కు హీరోయిన్లు సెట్ చేసిన దర్శకుడు.. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్!

Subscribe to Filmibeat Telugu

ఆసక్తికరమైన మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధం అయింది. కమర్షియల్ చిత్రాలతో ఆడియన్స్ కు పూర్తి వినోదాన్ని అందించడంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే విజయం సాధించాడు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాలతో అనిల్ రావిపూడి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజగా ఈ దర్శకుడు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో మల్టి స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే.

Heroines fixed for Venkatesh and Varun Tej.

ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ పేరుతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మల్టి స్టారర్ చిత్రపు ఇప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. విభిన్న కథలని ఎంచుకుంటున్న వెంకీ మల్టి స్టారర్ చిత్రాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

ఇక వరుణ్ తేజ్ వరుస రెండు హిట్స్ తో ఫామ్ లో ఉన్నాడు. తాజగా అనిల్ రావిపూడి వెంకీ, వరుణ్ కు హీరోయిన్లని ఖరారు చేసాడు. వరుణ్ తేజ్ కు జోడిగా మెహ్రీన్ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలే నిజమయ్యాయి. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటిస్తుండగా వెంకటేష్ తో తమన్నా తొలి సారి రొమాన్స్ చేయబోతోంది. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది.

English summary
Heroines fixed for Venkatesh and Varun Tej. F2 will starts from June
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X