Just In
- 31 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 56 min ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 1 hr ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 2 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- News
వికారాబాద్‌లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జల్సా జీవితం: నేరస్తులతో హీరోయిన్ల సంబంధాలు, ఎవరెవరు?
హైదరాబాద్: సినిమా రంగం.... పైకి ఎంతో కలర్ ఫుల్‌గా కనిపించే ఒక రంగుల ప్రపంచం. కొందరు నటనపై మక్కువతో ఈ రంగం వైపు వస్తే...మరికొందరు డబ్బు సంపాదనే ధ్యేయంగా ఇటువైపు అడుగులు వేస్తుంటారు. ఇక్కడ ఒక్కసారి జల్సా జీవితానికి అలవాటు పడ్డాక పాత జీవితంలోకి వెళ్లడానికి మనసు ఒప్పదు.
ఒక్కోసారి పరిస్థితులు తలక్రిందులైన సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. ఒక్కోసారి చేతిలో చిల్లిగవ్వకూడా లేని పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో కొందరు స్టార్స్ తప్పుడు దారుల్లో ప్రయాణిస్తున్నారు. వ్యభిచారం, డ్రగ్స్, నేరస్తులతో చేతులు కలపడం, లేదా వారితో సంబంధాలు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు.
ముంబై కేంద్రంగా నడిచే బాలీవుడ్ పరిశ్రమలో కొందరు అవకాశాలు లేని హీరోయిన్లు ముంబై డాన్లతో స్నేహం చేసి.... వారి అండతో అవకాశాలు తక్కించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయనే వాదన ఉంది. కొందరు హీరోయిన్లయితే ఏకంగా మాఫియా డాన్లతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, వారిని పెళ్లి చేసుకోవడం లాంటివి కూడా చేసారు.
ఇటీవల కాలంలో డ్రగ్స్ కు సంబంధించిన కేసుల్లో వార్తల్లో బాగా వినిపిస్తున్న పేరు మమతా కులకర్ణి. ఒకప్పుడు బాలీవుడ్లో సెక్సీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆమె డ్రగ్స్ వ్యాపారం చేసే వ్యక్తితో చేతులు కలిపి అతడితో ప్రేమాయణం మొదలు పెట్టింది. చివరకు అతడినే పెళ్లి చేసుకుని డ్రగ్స్ వ్యాపారం చేస్తూ పోలిసుల హిట్ లిస్టులో చేరిపోయింది. మమతా కులకర్ణి మాత్రమే కాదు. బాలీవుడ్ నుండి ఇలా చాలా మంది నేరస్తులతో సంబందాలు పెట్టుకున్న వారు ఉన్నారు.
వారికి సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో.....

మమత కులకర్ణి
90వ దశకంలో బాలీవుడ్‌ను తన హాట్ అండ్ సెక్సీ అందాలతో ఊర్రూతలు ఊగించిన ఘనత మమత కులకర్ణి సొంతం. తర్వాత తన ప్రియుడు వికీ గోస్వామిని పెళ్లాడారు. పెళ్లి తర్వాత తర్వాత ఇద్దరూ కెన్యాలోని నైరోబీకి మకాం మార్చి అక్కడ కూడా డ్రగ్స్ అక్రమ వ్యాపారం మొదలు పెట్టారు. గతంలో వికీ గోస్వామి డ్రగ్స్‌తో కెన్యా పోలీసులకు పట్టుబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మమతకు కూడా ఈ నేరంలో భాగం ఉందని పోలీసులు అంటున్నారు.

సంగీత చటర్జీ
ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్‌ను రెండో వివాహం చేసుకున్న మోడల్ సంగీత చటర్జీ ఎర్రచందనం స్మగ్లింగులో భాగం అయినట్లు పోలీసులు గుర్తించారు.

మోనికా బేడీ
తెలుగు చిత్రం ‘తాజ్ మహల్'లో నటించిన బాలీవుడ్ బ్యూటీ మోనికా బేడీ...ముంబై పేలుళ్లలో ప్రధాన నిందుతుడుగా ఉన్న అబూసలెంతో ప్రేమాయణం నడిపింది. అతనితో కలిసి నేరానికి పాల్పడిందనే ఆరోపణలతో కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించింది.

మందాకిని
ఒకప్పుడు బాలీవుడ్ ను తన సెక్సీ ఒంపుసొంపులతో మత్తెక్కించిన మందాకిని....మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో దావూద్ తో స్నేహం చేసింది.

డాన్ ను పెళ్లాడింది
బాలీవుడ్ తొలితరం నటి సోనా....హజీ మస్తానే అనే నేరస్తుడు(ముంబైలో తొలితరం డాన్)ను పెళ్లాడింది.

అనితా ఆయుబ్
స్మాల్ టైమ్ యాక్ట్రెస్ అనితా ఆయుబ్ కూడా దావూద్ కు చాలా క్లోజ్ అని అంటుంటారు.