»   » ‘హేయ్ పిల్లగాడ’ అంటూ మళ్లీ ఫిదా చేయబోతున్న సాయి పల్లవి

‘హేయ్ పిల్లగాడ’ అంటూ మళ్లీ ఫిదా చేయబోతున్న సాయి పల్లవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి నటించిన మళయాలం మూవీ 'కలి' తెలుగులో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి తెలుగులో 'హేయ్ పిల్లగాడ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ల‌క్ష్మీ చెన్న‌కేశ‌వ ఫిలింస్ ప‌తాకంపై సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్ డి.వి.కృష్ణ‌స్వామి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా లోగోను ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల విడుద‌ల చేశారు.

స‌మీర్ తాహిర్ ద‌ర్శ‌కత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాల్ హీరో. యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మళయాలంలొ ఈ చిత్రం భారీ విజయం సాధించింది. 'ఫిదా' మూవీతొ సాయి పల్లవికి ఇక్కడ మంచి క్రేజ్ వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

శేఖ‌ర్ క‌మ్ముల మాట్లాడుతూ

శేఖ‌ర్ క‌మ్ముల మాట్లాడుతూ

"దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం క‌లి. ఈ చిత్రం మ‌ల‌యాళం, త‌మిళంలో పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమాను తెలుగులో హే పిల్ల‌గాడా! అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. తెలుగులో సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటూ దుల్క‌ర్‌, సాయిప‌ల్ల‌వి స‌హా నిర్మాత‌కు అభినంద‌న‌లు" అని వ్యాఖ్యానించారు.

బాషాశ్రీ

బాషాశ్రీ

ఈ చిత్రం తెలుగు వెర్షన్ ర‌చ‌యిత భాషా శ్రీ మాట్లాడుతూ...."హే..పిల్ల‌గాడా సినిమా అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమా చాలా చ‌క్క‌గా వ‌చ్చింది. హేమ‌చంద్ర హీరో వాయిస్‌కు డ‌బ్బింగ్ చెప్పారు.ఈ సినిమాలో నేను భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది" అన్నారు.

సురేంద్ర కృష్ణ మాట్లాడుతూ

సురేంద్ర కృష్ణ మాట్లాడుతూ

ఈ చిత్రానికి తెలుగు పాట‌లు రాసిన సురేంద్ర కృష్ణ మాట్లాడుతూ "సెప్టెంబ‌ర్ 8న హేయ్‌..పిల్ల‌గాడ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాలో మంచి మెలోడి పాట రాయ‌డం ఆనందంగా ఉంది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పించే సినిమా అవుతుంది. దుల్క‌ర్‌, సాయిప‌ల్ల‌వి జోడి క్యూట్‌గా ఉంటుంది. మంచి రొమాంటిక్ ల‌వ్ స్టోరీ. కాస్తా యాక్ష‌న్ పార్ట్ కూడా ఉంటుంది అన్నారు.

నిర్మాత డి.వి.కృష్ణ‌స్వామి

నిర్మాత డి.వి.కృష్ణ‌స్వామి

నిర్మాత డి.వి. కృష్ణ స్వామి మాట్లాడుతూ... " ఓకే బంగారం దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఫిదా సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం హేయ్..పిల్ల‌గాడ‌. ఇదొక టిపిక‌ల్ ల‌వ్‌స్టోరీ. సెప్టెంబ‌ర్ 8న సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. యూత్‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది. ఈ సినిమాను ఫిదాలాగానే స‌క్సెస్ చేస్తార‌ని భావిస్తున్నాం" అన్నారు.

హేయ్ పిల్లగాడ

హేయ్ పిల్లగాడ

ఈ చిత్రానికి మాట‌లుః భాషా శ్రీ, సాహిత్యంః సురేంద్ర కృష్ణ‌, సంగీతంః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః గిరీష్ గంగాధ‌ర‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ద‌క్షిణ్ శ్రీనివాస్‌, కో ప్రొడ్యూస‌ర్ః వి.చంద్ర‌శేఖ‌ర్‌, నిర్మాతః డి.వి.కృష్ణ‌స్వామి, ద‌ర్శ‌క‌త్వంః స‌మీర్ తాహిర్‌.

English summary
Sai Pallavi, Dulquer Salman Malayalam film Kali will now be coming to Tollywood and the makers have titled the movie as Hey Pillagada. The movie is scheduled for a grand release in the month of September. The film is produced by DV Krishna Swamy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu