»   » అంబేద్కర్ వర్థంతికీ రజినీ "కాలా" కీ సంబందమేమిటి? పోస్టర్ సరిగా చూస్తే బుర్ర తిరిగి పోతుంది

అంబేద్కర్ వర్థంతికీ రజినీ "కాలా" కీ సంబందమేమిటి? పోస్టర్ సరిగా చూస్తే బుర్ర తిరిగి పోతుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజినీకాంత్ అల్లుడు ధనుష్ సడెన్ గా పెద్ద షాకే ఇచ్చాడు. సూపర్ స్టార్ కొత్త సినిమా టైటిల్.. దాని లోగో రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచాడు. రోబో సీక్వెల్ '2.0' తర్వాత రజినీ.. 'కబాలి' డైరెక్టర్ పా.రంజిత్ తో ఇంకో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అయినా ఇంత త్వరగా ఈ సినిమా మొదలూ పెడతారని ఎవ్వరూ ఊహించలేదు. ఇంకొన్ని రోజుల్లోనే సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ సినిమాకు ముందే టైటిల్ ప్రకటించారు. కాలా.. ఇదీ ఈ సినిమా టైటిల్.ఉదయం లోగో రిలీజ్ తో ప్రీ లుక్ ఇచ్చిన దర్శకుడు పా రంజిత్.. సాయంత్రానికల్లా ఫస్ట్ లుక్ విడుదల చేసేశాడు. కరికాలన్ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు.

కనీవినీ ఎరుగని రీతిలో

కనీవినీ ఎరుగని రీతిలో

పోయిన సంవత్సరంలో కనీవినీ ఎరుగని రీతిలో బ్రహాండమైన క్రేజ్ తో విడుదలైన చిత్రం రజనీకాంత్ నటించిన ‘కబాలి'. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అభిమానులు ఆశించిన రీతిలో లేక మంచి వసూళ్లను సాధించిందేగాని భారీ హిట్ గా మాత్రం నిలవలేకపోయింది.


పా. రంజిత్

పా. రంజిత్

ఇప్పుడు అదే పా. రంజిత్ మరోసారి రజనీ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. వండర్ బాల్ ఫిలిమ్స్ బ్యానర్ పై రజనీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ ప్రకటన వెలువడ్డప్పటి నుండి ఈ సినిమా ఖచ్చితంగా ‘కబాలి' కి సీక్వెల్ అని వార్తలు వినిపించాయి.


MH 01 BR 1956

MH 01 BR 1956

అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ కాలా పోస్టర్ లో చాలామంది గమనించని ఒక విషయం ఉంది. పోస్టర్ లో రజినీ కూర్చున్న జీప్ నంబర్ ని గమనించారా??? సరిగ్గా గమనిస్తే సినిమా ఏ అంశం మీద తీయ బోతున్నాడో, ఎంతటి సున్నితమైన అంశాన్ని టచ్ చేసే దైర్యం చేసాడో అర్థమైపోతుంది. ఇంతకీ ఆ జీప్ నంబర్ MH 01 BR 1956 .


1956 అంటే బాబా సాహెబ్ వర్థంతి

1956 అంటే బాబా సాహెబ్ వర్థంతి

ఏదైనా అందిందా? MH అంటే మహారాష్ట్ర అనీ తెలిసి పోతుంది ఆ తర్వాత కని పించేది BR (భీంరావ్ అంబేద్కర్) 1956 అంటే బాబా సాహెబ్ వర్థంతి సంవత్సరం. ఇప్పటికే ఒకసారి తన ముందు సినిమాలో మా నాయిన బాలయ్య అనే పుస్తకాన్ని చూపించి తన స్టాండ్ ఎటువైపో చెప్పిన పా రంజిత్


కుల వివక్ష మీదా, అణచివేత మీదా

కుల వివక్ష మీదా, అణచివేత మీదా

ఈ సారి కూడా మళ్ళీ.. ఈ దేశం లో పేరుకు పోయిన కుల వివక్ష మీదా, అణచివేత మీదా ఫోకస్ చేయనున్నాడా? అన్న అనుమానం కలుగుతోంది. ఇక కబాలీ లో కూడా రజినీ అణచి వేయబడ్డ వర్గం నుంచే పైకి ఎదిగిన నాయకుడి గా కనిపిస్తాడు. రజినీ వేసుకునే దుస్తుల మీద కూడా అంబేద్కర్ ని గుర్తు చేసే డైలాగులు ఉంటాయ్ కబాలీ లో...


దళిత మాదిగ కుటుంబం చేసిన పోరాటం

దళిత మాదిగ కుటుంబం చేసిన పోరాటం

కరీంనగర్ కు చెందిన వైబీ సత్యనారాయణ అనే రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాసిన పుస్తకం ‘మా నాయిన బాలయ్య'. ఇది సమాజంలోని అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థితికి చేరిన తెలంగాణ దళిత మాదిగ కుటుంబం చేసిన పోరాటం నేపథ్యంలో సాగే కథ. దళిత సాహిత్యంలో చాలా గొప్ప పుస్తకంగా ఇది పేరు తెచ్చుకుంది.


మై ఫాదర్ బాలయ్య

మై ఫాదర్ బాలయ్య

తన కుటుంబ చరిత్రని ఆయన ఇందులో చెప్పుకుంటూ వచ్చాడు. ముత్తాత నర్సయ్య దగ్గర్నుంచి మొదలుపెట్టి తన తండ్రి యెలుకటి బాలయ్యతో పాటు మొత్తం నాలుగు తరాల చరిత్రను చెప్పారిందులో. దీన్ని ఇంగ్లిష్ లోకి ‘మై ఫాదర్ బాలయ్య' పేరుతో అనువాదం చేశారు. ‘కబాలి సినిమాలో రజినీకాంత్ ఓ సన్నివేశంలో ఈ పుస్తకాన్ని చదువుతూ కనిపిస్తాడు.


రాజకీయాల్లోకి రాబోతున్న సందర్భం లో

రాజకీయాల్లోకి రాబోతున్న సందర్భం లో

అంతే కాదు ఇప్పుడు రాజకీయాల్లోకి రజినీ రాబోతున్న సందర్భం లో ఈ సబ్జెక్ట్ ని ఎంచుకోవటం వెనుక ఏ విషయాలని చర్చించ బోతున్నాడో అన్నది ఊహించటం కష్టమేం కాదు. ఓ దర్శకుడి కులం గురించి మాట్లాడ్డం సరి కాదు కానీ.. ఇక్కడ ఆ విషయం ప్రస్తావించాల్సిందే.


పేద దళిత కుటుంబం నుంచి

పేద దళిత కుటుంబం నుంచి

రంజిత్ ఓ పేద దళిత కుటుంబం నుంచి వచ్చాడు. అనేక కష్టాలకు ఓర్చి పైకెదిగాడు. రంజిత్ తొలి రెండు సినిమాల్లోనూ అంతర్లీనంగా దళిత కుటుంబాల.. వారి సమస్యల ప్రస్తావన ఉంటుంది. దళిత సాహిత్యం మీద రంజిత్ కు ఎంతో పట్టుంది. కమ్యూనిజం మీద.. అంబేద్కరిజం మీద అతడికి మంచి అవగాహన ఉంది.


ఒక ఆలోచనలో పడేసే వివాదాస్పద సినిమా

ఒక ఆలోచనలో పడేసే వివాదాస్పద సినిమా

‘కబాలి' షూటింగ్ సందర్భంగానూ తాను చదివిన గొప్ప పుస్తకాల్ని రజినీకి పరిచయం చేసినట్లు చెప్పాడు రంజిత్. ఇప్పుడు కనిపించే ఈ సింటంస్ ని బట్టి పా రంజిత్ తీయ బోయే సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది... లేదా హిట్ తో బాటు దేశం మొత్తాన్నీ ఒక ఆలోచనలో పడేసే వివాదాస్పద సినిమా అవుతుంది. అన్నిటికన్నా రజినీ రాజకీయ ప్రవేశానికి మంచి ప్లస్ అవుతుంది అదన్న మాట సంగతి...English summary
BR refers to B R Ambedkar and 1956 was the year he passed away. It is well known that PA Ranjith is a hardcore follower of Ambedkar and he showed few shades even in his earlier movie Kabali. So, those who figured this out feel Kaala is also going to be a pro Dalit film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu