»   » మోహన్ బాబు కేసు: పద్మశ్రీ తొలగించాలని కోర్టు ఆదేశం

మోహన్ బాబు కేసు: పద్మశ్రీ తొలగించాలని కోర్టు ఆదేశం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ నటులు మోహన్ బాబు, బ్రహ్మానందం భారత ప్రభుత్వం అందజేసిన ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' అవార్డును దుర్వినియోగం చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా సినిమా టైటిళ్లలో వారి పేర్ల ముందు 'పద్మశ్రీ' అని వేయించుకున్నారని వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

 High Court has Orders to Mohan Babu

ఈ వివాదంపై రాష్ట్ర హైకోర్టు సోమవారం రోజు విచారణ జరిపింది. దేనికైనా రెడీ చిత్రానికి గౌరవ ప్రొడ్యూసర్‌గా మెహన్ బాబు ఉన్నారని, ఆయన ప్రేమేయం లేకుండా టైటిల్స్‌లో పద్మశ్రీ పేరు వాడారని ఆయన తరుపు లాయర్ వాదించారు.

'దేనికైనా రెడీ' చిత్రం టైటిల్స్‌లో మోహన్ బాబు పేరు ముందు ఉన్న 'పద్మశ్రీ' పదాన్ని తొలగించాలని, సినిమా నెగెటివ్ ప్రింట్స్ నుంచి కూడా ఆ పదాన్ని తొలగించాలని, తొలగించిన విషయాన్ని నిర్మాతలు ప్రత్రికల్లో ప్రకటన ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసులో మోహన్ బాబుకు తాత్కాలిక ఊరట లభించినట్లయింది.

కాగా, బ్రహ్మానందం లాయర్ కోర్టులో తన వాదనలు వినిపిస్తూ.... టైటిల్స్‌లో పద్మశ్రీ వాడొద్దని నిర్మాతలకు విజ్ఞప్తి చేసామని కోర్టుకు తెలిపారు. తమకు సంబంధం లేకుండా పద్మశ్రీ పేరు వాడారని అఫిడవిట్ దాఖలు చేయాలని బ్రహ్మానందంకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.

మోహన్ బాబు కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఈ అఫిడవిట్లపై విచారణ జరిపిన అనంతరం.....వీరిద్దరికి ఇచ్చిన పద్మశ్రీ అవార్డులను వెనక్కి తీసుకోవాలా? లేదా? అనే అంశంపై ఓ నిర్ణయానికి రానుంది కోర్టు.

ఈ నెల 23న రాష్ట్ర హైకోర్టు...పద్మశ్రీ అవార్డులను వారంలోగా తిరిగి ఇచ్చేయాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని బ్రహ్మానందం, మోహన్ బాబులను ఆదేశించింది. అయితే తమ ప్రమేయం లేకుండా తమ పేర్ల ముందు పద్మశ్రీ వాడారని వారు కోర్టుకు విన్నవించారు.

English summary
The Andhra Pradesh High Court has Orders to Telugu film actor-producer Mohan Babu renove 'Padma Sri' from Denikaina Ready movie titles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu