»   » బాలకృష్ణ, గుణశేఖర్‌కు హైకోర్టు షాక్.. రెండువారాల్లో..

బాలకృష్ణ, గుణశేఖర్‌కు హైకోర్టు షాక్.. రెండువారాల్లో..

Written By:
Subscribe to Filmibeat Telugu

గౌతమి పుత్ర శాతకర్ణికి సంబంధించిన వినోదపు పన్ను విషయంలో సినీ హీరో బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమా నిర్మాతలకు కూడా నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇటీవల గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి ఆంధ్రప్రదేశ్, రాణి రుద్రమదేవీ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం వినోదపన్నులో రాయితీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

వినోదపన్ను మినహాయించడంపై

వినోదపన్ను మినహాయించడంపై

గౌతమి పుత్ర శాతకర్ణి, రాణి రుద్రమదేవి చిత్రాలకు వినోదపన్ను మినహాయించడంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ చిత్రాలకు పన్ను మినహాయించినప్పుడు.. దానికి సంబంధించిన ప్రయోజనాలను ప్రేక్షకులకు ఎందుకు ఇవ్వలేదో తెలపాలని స్పష్టం చేసింది.

రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని

రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని

రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నటుడు బాలకృష్ణతో పాటు శాతకర్ణి చిత్ర నిర్మాత రాజీవ్ రెడ్డి, రుద్రమదేవి దర్శక నిర్మాత గుణశేఖర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

టికెట్ ధరలో రాయితీ లాంటి

టికెట్ ధరలో రాయితీ లాంటి

వినోదపన్ను మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో ప్రేక్షకులకు టికెట్ ధరలో రాయితీ లాంటి ప్రయోజనాలు ఇవ్వలేదంటూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం కార్యదర్శి వేణుగోపాల్ రావు హైకోర్టును పిటీషన్ దాఖలు చేశారు.

ఈ పిల్‌ను న్యాయస్థానం..

ఈ పిల్‌ను న్యాయస్థానం..

ఈ పిల్‌ను న్యాయస్థానం మంగళవారం విచారించింది. గతంలో ఈ విషయంలో తమిళనాడు తీర్పును పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

English summary
High court issues notices to Hero Balakrishna, producer Gunashekhar. Regarding entertainment tax of Gautami Putra Shatakarni, Rudramadevi court issues notices AP, Telangana governments too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu