»   » ‘శ్రీమంతుడు’రైటర్ కు జలక్, మహేష్‌బాబు, దర్శకుడు శివలకు హైకోర్టులో ఊరట

‘శ్రీమంతుడు’రైటర్ కు జలక్, మహేష్‌బాబు, దర్శకుడు శివలకు హైకోర్టులో ఊరట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మహేష్ బాబు శ్రీమంతుడి సినిమా మీద నడుస్తున్న వివాదం గురించి తెలిసిందే. తాను రాసిన నవలను కాపీ కొట్టారంటూ.. సినీ నటుడు మహేష్ బాబు.. చిత్ర దర్శకుడు కొరటాల శివలపై ఫిర్యాదు చేసారు. ఈ విషయంలో మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివలకు హైకోర్టులో వూరట లభించింది.

'శ్రీమంతుడు' సినిమా కాపీరైట్‌ వివాదంపై దాఖలైన పిటిషన్‌ను స్వీకరించిన నాంపల్లిలోని మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు.. వారిద్దరికీ సమన్లు జారీచేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల అమలును ఉమ్మడి హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.శంకరనారాయణ గురువారం ఉత్తర్వులిచ్చారు.


2012లో స్వాతి మాసపత్రికలో తాను 'చచ్చేంత ప్రేమ' అనే నవలను రాశాననీ, దానిని కాపీచేసి శ్రీమంతుడు సినిమాగా మలిచారని ఆరోపిస్తూ, హైదరాబాద్‌కు చెందిన రచయిత ఆర్‌.డి.విల్సన్‌ అలియాస్‌ శరత్‌చంద్ర నాంపల్లి క్రిమినల్‌ కోర్టును ఆశ్రయించారు.


High Court Jhalak to Srimanthudu Original Writer!

కాపీరైట్‌ చట్టం, భారత శిక్షా స్మృతి కింద వారిపై కేసు నమోదుచేసి, విచారణ జరపాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు, ఈ ఏడాది జనవరి 24న మహేష్‌బాబు, శివలకు విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కొరటాల శివ హైకోర్టును ఆశ్రయించారు.


మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతోపాటు 'బాహుబలి' తర్వాత ఓవర్సీస్ లో తెలుగు సినిమా మార్కెట్ ను మరింతగా వ్యాపింపజేసిన చిత్రం 'శ్రీమంతుడు'. 2015, ఆగస్టు 7వ తారీఖున విడుదలైన 'శ్రీమంతుడు' చిత్రం కథ, కథనం నాది అంటూ నేడు (అక్టోబర్ 23, 2015) మీడియా ముందుకొచ్చాడు రచయిత శరత్ చంద్ర.


2012 సంవత్సరంలో తాను రాసిన 'చచ్చేంత' ప్రేమ అనే నవలను ప్రఖ్యాత మాసపత్రిక 'స్వాతి' ప్రత్యేక సంచిక ద్వారా ప్రచురించిందని, ఆ నవలను వెంకట్రావ్ అనే నిర్మాత తన నుంచి కొనుక్కొన్నాడని, నారా రోహిత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో నిర్మాత వెంకట్రావ్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకొంటున్న తరుణంలో 'శ్రీమంతుడు' రిలీజ్ అవ్వడం.. సూపర్ హిట్ అవ్వడం కూడా జరిగిపోయాయి.


ఈ విషయమై గత కొన్ని నెలలుగా తమిలంతోపాటు తెలుగు రచయిత సంఘాల్లోనూ ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదు, కొంతమంది ఇండస్ట్రీ పెద్దలను సైతం కలిసాము. ఇక వేరే దారిలేక మీడియా ముందు మా బాధను వెలిబుచ్చుకుంటున్నాము. ఏదో డబ్బులు ఆశించి మేమీ ఫిర్యాదు చేయడం లేదు. నాలా మరో రచయితకు భవిష్యత్ తో ఇటువంటి అన్యాయం జరగకూడదన్న ఆలోచనతోనే మాకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకొంటున్నానని రచయిత శరత్ చంద్ర తెలిపారు.


ఈ విషయమై న్యాయం కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమని, తమ కథను కాపీ కొట్టడం విషయంలో 'శ్రీమంతుడు' దర్శకనిర్మాతల్ని సంప్రదించగా.. వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం అటుంచి తమను ఎంతో నీచంగా మాటలన్నారని పేర్కొన్నారు!

English summary
'Srimanthudu' had to face plagiarism charges. A writer named Sharat Chandra alleged that the makers had copied his novel 'Chachchentha Prema' published in Swathi weekly. The makers of 'Srimanthudu' received summons from the Nampally court. It was speculated that the issues would be resolved outside the court.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu