»   »  వర్మ పిచ్చి పనులపై ముంబై హైకోర్టు దెబ్బ : సర్కార్ 3 కథ మీద రేగిన వివాదం

వర్మ పిచ్చి పనులపై ముంబై హైకోర్టు దెబ్బ : సర్కార్ 3 కథ మీద రేగిన వివాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవ‌ల బాలీవుడ్ వెళ్లి ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కించిన రామ్‌గోపాల్ వ‌ర్మ 'స‌ర్కార్‌-3' వివాదాల్లోకొచ్చింది. ఈ సినిమాకి క‌థ రాసింది వ‌ర్మ కాదు అంటూ ఓ వ్యక్తి వర్మపై కేసు వేశాడు. అతనే నీలేష్ గిర్కార్. రిలీజ్ కు రెడీ అయిన రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా 'సర్కార్-3' కథ రాసింది ఆయన కాదంట.

డబ్బులు ఎగ్గొట్టాడు

డబ్బులు ఎగ్గొట్టాడు

ముంబైకి చెందిన రైటర్ నీలేష్ గిర్కార్ అనే ఆయన ‘సర్కార్-3' కథ రాశారట. ఇక ఇప్పుడు వర్మ తన దగ్గర కథ తీసుకుని, టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వడం లేదని, అలాగే డబ్బులు కూడా ఎగ్గొట్టాడని నీలేష్ గిర్కార్ ఆరోపిస్తుండటం హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా ఈ విషయంపై నీలేష్ తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించడం, వెంటనే కోర్టు కూడా అతని విషయంలో సానుకూలంగా స్పందించడం హైలైట్ న్యూస్ అయింది.

 6.2 లక్షలు డిపాజిట్

6.2 లక్షలు డిపాజిట్

ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి.. నీలేష్ సమర్పించిన స్క్రిప్టును పరిశీలించడంతో పాటు సర్కార్-3 ప్రివ్యూ కూడా చూశారు. అనంతరం తీర్పు వెలువరించారు.ఈ క్రమంలో నీలేష్ పిటిషన్ ను పరిశీలించిన అనంతరం కోర్టు.. అతడికి వర్మ ‘సర్కార్-3' స్పెషల్ స్క్రీనింగ్ వేసి అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వాలని, అలాగే ఈ వివాదం సెటిల్మెంట్ కోసం కోర్టులో రూ. 6.2 లక్షలు డిపాజిట్ చెయ్యాలని ఆదేశించడం గమనార్హం.

ఇప్పటికే రెండు సార్లు వాయిదా

ఇప్పటికే రెండు సార్లు వాయిదా

మామూలుగా అయితే దేనినీ లెక్క చేయనట్టుండే వర్మ ఈ సారికి మాత్రం మారు మాట్లాడకుండా కోర్టు చెప్పినట్లుగా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో ఈ కేసు కారణంగా ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా ఉండాలని వర్మ ఇంక సైలెంట్ అయిపోయాడు.

చాలా ఆశలే పెట్టుకున్నాడు

చాలా ఆశలే పెట్టుకున్నాడు

ఈ సినిమా వర్మ కెరీర్ కు చాలా కీలకమైంది. ఈ సినిమాపై ఆయన చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇలాంటి సమయం లో మళ్ళీ అనవసర వివాదాలు ఎందుకనుకున్నాడో, జనాల్లో తన పేరు పాడౌతుందనుకున్నాడో గానీ సైలెంట్ గా వివాదాన్ని పరిష్కారం అయ్యేలా చూసుకున్నాడు.

క్యారెక్టర్ కి మచ్చ తెస్తాయి

క్యారెక్టర్ కి మచ్చ తెస్తాయి

నిజానికి వర్మ ఎంత ఘాటుగా మాట్లాడినా, ఎన్ని విమర్శలకు లోనైనా, తిట్టుకుంటూ కూడా వర్మని అభిమానగా చూసేవాళ్ళే అంతా దానికి కారణం వర్మ వ్యక్తిత్వం. అయితే ఇలాంటి వివాదాలు క్యారెక్టర్ కి మచ్చ తెస్తాయి అనుకున్నాడేమో మరి. సర్కార్.. సర్కార్ రాజ్ సినిమాలకు కొనసాగింపుగా వస్తున్న సర్కార్-3లో అమితాబ్ తో పాటు మనోజ్ బాజ్ పేయి.. యామీ గౌతమ్.. అమిత్ కీలక పాత్రలు పోషించారు.

English summary
Bombay High Court has directed the filmmaker Ram Gopal Varma to give scriptwriter Nilesh Girkar due credit for Sarkar 3 apart from settling the outstanding amount of Rs. 6.20 lakhs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu