twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్‌ విశ్వరూపం సినిమాకు హైకోర్టు షాక్

    By Pratap
    |

    చెన్నై: విశ్వరూపం సినిమా విడుదలపై మద్రాసు హైకోర్టులో కమల్ హాసన్‌కు గురువారం షాక్ తగిలింది. సినిమా విడుదలపై ఈ నెల 28వ తేదీ వరకు హైకోర్టు బ్రేక్‌లు వేసింది. ఈ నెల 28వ తేదీ వరకు సినిమాను విడుదల చేయకూడదని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీన న్యాయమూర్తి చూడనున్నారు. తన ఆదేశాలు తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే పరిమితమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.

    విశ్వరూపం సినిమా విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను కమల్ హాసన్ మద్రాసు హైకోర్టులో సవాల్ చేశారు. సెన్సార్ అయిన సినిమాను ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని ఆయన తన పిటీషన్లో పేర్కొన్నారు. అంతకు ముందు ఆయన ప్రభుత్వ తీరుపై స్పందిస్తూ తన మద్దతు దారులకు బహిరంగ లేఖ రాశారు. చిత్రంపై నిషేదం విధించడం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఇలా చేయడాన్ని సాంస్కృతిక ఉగ్రవాదంగా అభివర్ణించారు. ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడటం సమంజసం కాదన్నారు.

    కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రాన్ని చంద్రహాసన్, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్లుగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా, రాహుల్ బోస్, జైదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈనెల 25న సినిమా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు.

    తమిళనాడులో ముస్లిం సంఘాల ఆందోళన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ సినిమాపై 15 రోజుల నిషేదం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సినిమాపై కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం ఏ సీన్లు కట్ చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది.

    English summary
    High court stay orders on the release of Viswaroopam film. Expressing his shock at the two-week ban ordered by the Tamil Nadu government on his film 'Vishwaroopam', Kamal Hassan has filed a petition challenging the ban in the Madras High Court.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X