For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ 'టెంపర్' పోస్టర్స్ లో హైలెట్

  By Srikanya
  |

  హైదరాబాద్ : పూరీ-ఎన్టీఆర్ కలిసి తెరపై తమ 'టెంపర్'ని చూపించటానికి శరవేగంగా సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.అనూప్ రూబెన్స్ స్వరాలందిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఇందులో ఎన్టీఆర్ పోలీస్ అధికారిగా నటించనున్నారట. జనవరి 9న చిత్రాన్ని విడుదల చేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ నవంబర్ 29న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమచారం. ఆ సందర్బంగా విడుదల చేసే పోస్టర్స్ డిఫెరెంట్ గా ప్లాన్ చేసిననట్లు తెలుస్తోంది.

  అందిన సమాచారం ప్రకారం టెంపర్ పోస్టర్స్ ఆరు డిజైన్స్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఎన్టీఆర్ తుపాకి పట్టుకున్నది, మరొకటి సీరియస్ గా చూస్తున్నది, వేరొకటి గోవా బోచ్ లో కూర్చుని ఉన్నది, కాజల్ తో రొమాన్స్ చేసేది ఇలా ఆరు రకాలుగా డిజైన్ చేసి ఫస్ట్ లుక్ ని వదులుతున్నట్లు సమాచారం.

  ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం... టెంపర్ లో మంచి ట్విస్ట్ లు, టర్న్ లు ఉన్నాయని అంటున్నారు. ఎన్టీఆర్ ఎన్నో కమర్షియల్ చిత్రాల్లో చేసినప్పటికి ఇది స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు. మరో ప్రక్క డిసెంబర్ 1 వ తేదీన టెంపర్ టీజర్ విడుదల చేయటానికి సిద్దం చేస్తున్నారు. ఎడిటర్ ఎస్.ఆర్ శేఖర్ ఈ మేరకు ఆ వీడియో ఎడిటింగ్ పనిలో బిజీగా ఉన్నారు.

   Highlight in Ntr's TEMPER posters

  గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇప్పటివరకూ ఏ టైటిలూ అఫీషియల్ గా ప్రకటించలేదు. ఈ నేపధ్యంలో ఇప్పటివరకూ నేనో రకం, టెంపర్ అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘షంషేర్' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ ఫైనల్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు డిజైన్స్ చేయించి చూసినట్లు తెలుస్తోంది.

  ఇక అందుతున్న సమాచారం ప్రకారం...ఈ వారంలోనే ఓ టైటిల్ ని ఫైనల్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదలనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూనిట్ రాత్రింబవళ్లూ కష్టపడుతున్నట్లు వినపడుతోంది. సినీ కార్మికులు సమ్మె విరమించడంతో షూటింగ్ లు మళ్లీ మొదలవుతున్నాయి. ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ల సినిమా స్వల్ప విరామం తర్వాత ప్రారంభమైంది. ఎన్టీఆర్‌ సినిమా అంటే మాస్‌ ప్రేక్షకులకు పండగే. పోరాట ఘట్టాలూ, నృత్యాలూ, పదునైన సంభాషణలతో విందు భోజనం వడ్డించేస్తారు. ఇలాంటి కథల్ని తెరపై ఆవిష్కరించడంలో దిట్ట పూరి జగన్నాథ్‌. వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. కాజల్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్‌ నిర్మాత.

  ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ సాగుతోంది. అక్కడ యాక్షన్‌ ఘట్టాలతో పాటు కొన్ని సరదా సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ శక్తిమంతమైన పోలీసు అధికారిగా కనిపిస్తాడని సమాచారం. 'నేనో రకం', 'టెంపర్‌' అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ .

  అలాగే...కొంతకాలం దర్శకుడు,హీరో మధ్య ఇగో క్లాషెష్, కొంతకాలం భారీ వర్షాలు, మరికొంతకాలం స్ట్రైక్ ఇలా రకరకాల కారణాలు..పూరీ, ఎన్టీఆర్ సినిమాను ఆలస్యం చేస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆ లేటు వెళ్లి ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పూరీ. అందులో భాగంగా లైవ్ ఎడిటింగ్ ని చేయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇందునిమిత్తం గోవా షూటింగ్ స్పాట్ కు ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ వెళ్లారు. గతంలో ఎస్.ఆర్.శేఖర్.. పూరి చిత్రం ఇద్దరమ్మాయిలతో ట్రైలర్ కట్ చేసారు. ఆ ట్రైలర్ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే.

  షూటింగ్ అయిన దాన్ని ఎప్పటికప్పుడు ఎడిట్ చేసేస్తూంటారు. దాని మూలంగా బాగా రాని షాట్స్, మర్చిపోయిన షార్ట్ ఎప్పటికప్పుడు తెలిసిపోయి... ప్యాచ్ వర్క్ వంటివి నివారించవచ్చు. అలాగే ఎడిటింగ్ అయ్యే సమయం కలిసివస్తుంది. ప్రస్తుతం రఫ్ ఎడిటింగ్ చేసుకుని చివర్లో కాస్త టైమ్ తీసుకుని ఫైనల్ ఎడిటింగ్ చేసేస్తారు.

  English summary
  Temper posters in unique way and totally makers have designed 6 posters in total and one that shows NTR carrying gun, thinking seriously, sitting at Goa beach is going to be feast for NTR fans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X