»   » అనుష్క 'రుద్రమదేవి' ...USP తెలిసిపోయింది

అనుష్క 'రుద్రమదేవి' ...USP తెలిసిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అనుష్క హీరోయిన్ గా గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రమదేవి'. గుణ టీమ్‌ వర్క్స్‌ పతాకంపై ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ గా పెట్టుబడులు పెడుతున్నారు. వరస ప్లాపులతో ఉన్న గుణశేఖర్ కు ఈ చిత్రంపై నమ్మకం ఏమిటి...అంత పెట్టుబడి ఓ హీరోయిన్ చిత్రంపై పెట్టడానికి కారణం ఏమిటీ అంటే... సినిమాకు ఉన్న ఏకైక USP(unique selling point) తెలిసింది. అదే... ఇండియాలో ఈ చిత్రం తొలి హిస్టారికల్ 3డి చిత్రం. దాంతో ఈ చిత్రంలో వచ్చే 3డి ఎఫెక్టులపై ఎక్కువ శ్రద్ద పెట్టి చేస్తున్నారట. ఓ ఎపిక్ చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగించాలనే గుణశేఖర్ రాత్రింబవళ్లూ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వికారాబాదాద్ లో చిత్రం షూటింగ్ జరుగుతోంది.

గుణశేఖర్ మాట్లాడుతూ... ''మన సినిమాలెప్పుడూ ఆరు పాటలు, ఫ్యాక్షన్‌ పగలు, ప్రేమ కథల చుట్టూనే తిరుగుతుంటాయి. అలాంటి సినిమాలు నేనూ తీశాను. అందుకే... దర్శకుడిగా నాకు సంతృప్తి లభించలేదు. కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమ చర్రితను తెరకెక్కించి నాలోని దర్శకుడిని సంతృప్తిపర్చుకొనే ప్రయత్నం చేస్తున్నా. అర్జున్‌ సినిమా తీస్తున్నప్పుడు మొదటిసారి రాణి రుద్రమ కథ గురించి ఆలోచించాను. ఆ రోజు నుంచీ ఇప్పటి వరకూ ఈ కథపై ఆలోచన చేస్తూనే ఉన్నాం. ట్రయల్‌ షూట్‌ కూడా చేశాం. కొంతమంది నాయికలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించా. ఈ తరహా కథలకు బడ్జెట్‌ ఎక్కువ అవుతుంది.'' అన్నారు గుణశేఖర్‌.

Highlight of Rudrama Devi revealed

అలాగే హీరోయిన్ పై ఇంత ఖర్చుపెట్టడానికి నిర్మాతలు రకరకాలుగా ఆలోచించారు. 'అరుంధతి', 'ఈగ' సినిమాల్లో స్టార్లు లేరు. కథాబలంతో ఆ సినిమాలు నడిచాయి. ఆ నమ్మకంతోనే ఈ సినిమా నేనే నిర్మించడానికి పూనుకొన్నాను. హీరోయిన్ గా చాలామంది పేర్లు పరిశీలించాం. కొంతమంది 'మేం నటిస్తాం' అని ముందుకొచ్చారు. అన్ని విధాలా.. అనుష్క ఈ పాత్రకు సరైన న్యాయం చేయగలదు అనిపించింది. ఈ సినిమాని స్టీరియో స్కోపిక్‌ త్రీడీలో తెరకెక్కిస్తాం. త్రీడీ పరిజ్ఞానాన్ని వాడుకోవాలనో.. మరో కారణం చేతో ఈ సినిమా తీయడం లేదు.

రుద్రమ సాహసాలు నన్ను ఆకట్టుకొన్నాయి. ఆమె ధీరత్వమే నాకు స్ఫూర్తినిచ్చింది. రుద్రమ కాకతీయ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించి త్వరలో 750 యేళ్లు పూర్తవుతున్నాయి. ఇదే.. ఈ సినిమాకి సరైన తరుణం. ఇది ఓ చారిత్రక గాథ. సాంకేతిక నిపుణుల సహకారం లేనిదే ఈ తరహా సినిమాలు తెరకెక్కించలేం. ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజాతో పనిచేయడం ఇదే తొలిసారి. మిగతా సాంకేతిక విభాగంలోనూ అనుభవజ్ఞులున్నారు. సాధ్యమైనంత వరకూ చరిత్రను వక్రీకరించకుండా తీయాలనేదే నా ప్రయత్నం అని చెప్పారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కె.రాంగోపాల్ మాట్లాడుతూ..'తెలుగుజాతి గర్వించే రీతిలో కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
'Rudrama Devi' is being promoted as the first historical 3D film. So, Gunasekhar is making sure the film has got some brilliant 3D Effects to make audience hook on to the screens.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu