»   » ఉద్విగ్నం, ఉత్సాహం, ఆనందం .., బాహుబలి: ది కంక్లూజన్ ప్రీరిలీజ్ ఈవెంట్ హైలేట్స్ ఇవే

ఉద్విగ్నం, ఉత్సాహం, ఆనందం .., బాహుబలి: ది కంక్లూజన్ ప్రీరిలీజ్ ఈవెంట్ హైలేట్స్ ఇవే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమాకీ జరగనంత హడావిడి బాహుబలి కోసం జరుగుతోంది. ఎందుకంటే, 'బాహుబలి' సినిమా టాలీవుడ్‌తోపాటు, కోలీవుడ్‌నీ, ఆ మాటకొస్తే బాలీవుడ్‌నీ ఓ ఊపు ఊపేసింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు సినీ అభిమానలంతా చర్చించుకుంటున్న అంశం 'బాహుబలి ది కంక్లూజన్‌' మాత్రమేననడం అతిశయోక్తి కాదేమో. ఆ స్థాయిలో 'బాహుబలి'ని 'పాపులర్‌' చేసేశాడు దర్శకుడు రాజమౌళి. ఆదివారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీలో 'బాహుబలి: ద కంక్లూజన్' సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన కన్నుల పండువగా జరిగింది. ఆ హైలెట్స్ మీకోసం...

కీరవాణి పాట

కీరవాణి పాట

తన తమ్ముడు రాజమౌళి గురించి ‘ఎవ్వడంట ఎవ్వడంట..' పాట స్ఫూర్తితో ‘ఎవ్వడంట ఎవ్వడంట బాహుబలి తీసింది.. మా పిన్ని కన్నది ఈ నంది కాని నంది' అంటూ కీరవాణి స్వయంగా పాట రాసి.. దాన్ని వేదిక మీద ఆలపించడం.. అది చూసి రాజమౌళి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం ఈ వేడుకలో మేజర్ హైలైట్.

సూపర్‌ హిట్‌ సాంగ్‌ను అనుకరిస్తూ

సూపర్‌ హిట్‌ సాంగ్‌ను అనుకరిస్తూ

‘బాహుబలి'లో తను పాడిన సూపర్‌ హిట్‌ సాంగ్‌ను అనుకరిస్తూ రాజమౌళిపై ‘ఎవ్వడంట ఎవ్వడంట.. బాహుబలి తీసింది. మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది. ఎవ్వడూ కనందీ, ఎక్కడా వినందీ.. శివుని ఆన అయ్యిందేమో హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యిందీ' అంటూ మొదలు పెట్టి...

రాజమౌళి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు

రాజమౌళి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు

‘పెంచింది రాజనందిని కొండంత కన్న ప్రేమతో.. ఎంతెంత పైకి ఎదిగినా అంతంత ఒదుగువాడిగా..' అంటుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు రాజమౌళి. ‘చిరాయువై యశస్సుతో ఇలాగె సాగిపొమ్మని.. పెద్దన్న నోటి దీవెన శివుణ్ణి కోరు ప్రార్థన' అని పాడుతూ సోదరుడ్ని ఆలింగనం చేసుకున్నారు. ప్రతీ ఒక్కరినీ ఉద్వేగనికి గురి చేసిందీ సంఘటన.

టాలీవుడ్ కాలర్ ఎగరేసింది

టాలీవుడ్ కాలర్ ఎగరేసింది

‘‘గడచిన ఐదేళ్లలో ఆయన సాధించిన దానితో పోలిస్తే నేను సాధించింది పదో వంతే. ఇది ‘బాహుబలి: కంక్లూజన్' కాదు. దేశంలోని వేలాది మంది ఔత్సాహిక దర్శకులకు స్ఫూర్తినిచ్చిన ప్రారంభం'' అంటూ కరణ్ జోహా చెప్పిన మాట విని టాలీవుడ్ కాలర్ ఎగరేసింది.

రోప్ కట్టి ప్రభాస్ ను కిందికి దించడం

రోప్ కట్టి ప్రభాస్ ను కిందికి దించడం

విజువల్‌గా ఈ వేడుకకు ప్రత్యేకంగా నిలిచింది ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీనే. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా స్టేజ్ మీది నుంచి క్రేన్ సాయంతో రోప్ కట్టి ప్రభాస్ ను కిందికి దించడం.. కళ్లు చెదిరిపోయేలా చేసింది. ఒక సినీ వేడుకలో హీరో ఇలా ఎంట్రీ ఇవ్వడం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదే తొలిసారి అయ్యుండొచ్చు.

కృష్ణం రాజు ఇబ్బంది పడుతుంటే

కృష్ణం రాజు ఇబ్బంది పడుతుంటే

తన పెదనాన్న కృష్ణం రాజు వేదిక ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే ప్రభాస్ పరుగు పరుగున వెళ్లి ఆయనకు చెయ్యందించి జాగ్రత్తగా పక్కనే నడుస్తూ స్టేజ్ మీదికి తీసుకెళ్లడం కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. మొత్తం ఫంక్షన్ లో ఎక్కువ మంది మాట్లాడుకున్న అంశాల్లో ఇదీ ఒకటి.

వాడిది తప్పు అని తేలింది, తల తెగింది

వాడిది తప్పు అని తేలింది, తల తెగింది

తర్వాత ప్రభాస్ స్పీచ్ లో ‘‘అభిమానులు రెండేళ్లకో సినిమా, రెండున్నర ఏళ్లకో సినిమా చూశారు. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను. హిందీలో ఈ సినిమాను విడుదల చెయ్యడానికి అన్ని రకాలుగా సహాయపడుతూ అక్కడి మార్కెట్‌ పెంచిన కరణ్‌జోహార్‌కి మెనీ థ్యాంక్స్‌'' అన్నారు. ‘వాడిది తప్పు అని తేలింది. తల తెగింది', ‘నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేడు మామా' అంటూ రెండు డైలాగ్ లు చెప్పటం కూదా చాలామందికి నచ్చింది.

ఒక్క అవకాశం ఇవ్వు రాజమౌళీ

ఒక్క అవకాశం ఇవ్వు రాజమౌళీ

"బాహుబలి 3 తీస్తే అందులో ఒక్క షాట్‌ అయినా డైరెక్ట్‌ చేసే అవకాశం ఇవ్వు రాజమౌళీ'' అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అడిగినప్పుదు కూదా ఒక్క రాజమౌళి లోనే కాదు మొత్తం టీం అందరి కళ్ళలోనూ ఔను..! మేం సాధించింది చిన్న విజయమేం కాదు అన్న గర్వం కనిపించింది. రాఘవేంద్రుడి మాటలు చాలా ఆకట్టుకున్నాయి.

జక్కన్న ప్రసంగమే

జక్కన్న ప్రసంగమే

ఇక మరో హైలెట్ జక్కన్న ప్రసంగమే ‘‘నాకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి చెప్పింది, నేర్పించింది వి.ఎఫ్.ఎక్స్‌ సూపర్‌వైజర్‌ కమల్‌ కణ్ణన్. సెకండ్‌ యూనిట్‌లో చాలా సీన్లను కార్తికేయ డైరెక్ట్‌ చేశాడు. నేను కమర్షియల్‌ సినిమాలు చేస్తూ, కమర్షియల్‌ హీరోయిజంను ఎలివేట్‌ చేస్తూ, నాకు నచ్చిన విధంగా సినిమాలు తీసుకుంటూ వచ్చాను.

ప్రభాస్ కు నేనేమిచ్చాను?

ప్రభాస్ కు నేనేమిచ్చాను?

హీరోయిజంను తర్వాతి లెవల్‌కు తీసుకెళ్తూ వచ్చాను. ‘ప్రతి సినిమాలో ప్రతి హీరోకు ఒక ఎలివేషన్ ఇచ్చాను కదా.. ప్రభాస్ కు నేనేమిచ్చాను?' అని ప్రశ్నించుకుంటే.. సమాధానం ముంబైలో దొరికింది. అక్కడి మీడియా ప్రభాస్‌ను చూసి కేకలు వేస్తున్నారు. అది చూసి గర్వంగా ఫీలయ్యా'' అంటూ ఉద్వేగం తో చెప్పాడు.

ఆనాడే చెప్పాను

ఆనాడే చెప్పాను

మాహిష్మతి గురించి చెబుతూ ఉద్విగ్నానికి లోనయ్యాడు రానా. "కాలం కరిగిపోయే క్షణాల సమూహం అయితే.. బాహుబలి సినిమా ఎప్పటికీ నిలిచిపోయే శిల్పం అని ఆనాడే చెప్పాను. బాహుబలి విషయంలో ఈ మాటను నిజం చేసినందుకు థ్యాంక్స్. ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ వింటే.. నాకు చాలా గర్వంగా ఉంటుంది. అలాగే నాకు బాధ కూడా ఉంది'' అంటూ తన మనసులో ఉన్న బాధని చెప్పుకున్నాడు రానా.

ఆ ఫీలింగ్ నన్ను బాధిస్తోంది

ఆ ఫీలింగ్ నన్ను బాధిస్తోంది

''మాహిష్మతి అనే సామ్రాజ్యంలో నేను గడిపిన క్షణాల గురించి కలకాలం చెప్పుకుంటాను. నేను జీవితంలో ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రభాసే నా బెస్ట్ కో-స్టార్. అయితే ఇప్పుడు నా బాధ గురించి చెబుతాను. ఆల్రెడీ కళ్ళెమ్మటి నీళ్ళు కూడా వచ్చేశాయి. మళ్ళీ నేను మాహిష్మతికి వెళ్ళలేననే ఆ ఫీలింగ్ నన్ను బాధిస్తోంది'' అంటూ ఏమోషనల్ అయ్యాడు

English summary
Baahubali: The Conclusion’s grand pre release event was not short of a festival for Prabhas’s fans. After all, they had to wait over 2 years to see him back on the silver screen, after Baahubali: The Conclusion. these are the Highlights of Baahubali:the conclusion Pre release event
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu