»   »  తెలంగాణా సమస్యలతో బాలీవుడ్ చిత్రం

తెలంగాణా సమస్యలతో బాలీవుడ్ చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sunil Shetty
మన తెలుగులో ప్రాంతీయ సమస్యలు వివరిస్తూ వాస్తవాలన్ని చూపుతూ సినిమా తీసే వారి సంఖ్య మనకు బాగా తక్కువ. కమిట్ మెంట్ ఉన్న ఆర్.నారాయణ మూర్తి వంటి వారే ఇటువంటి సాహసాలు చేస్తూ జయాపజయాలకు సంభంధం లేకుండా ముందుకు వేళ్తున్నారు. తాజాగా వచ్చిన 'ఎర్రసముద్రం,బతుకమ్మ' ఈ కోవలోకి వచ్చే చిత్రాలే. ఇప్పుడు అదే వరసలోమావోయిస్టులపై చిత్రాన్ని రూపొందించేందుకు బాలీవుడ్‌లో సన్నాహాలు చేస్తున్నారు. సునీల్ శెట్టి ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తెలంగాణా ప్రాంతానికి సంబంధించిన అంశాలను కూడా మిళితం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

తన పిల్లలకు ఆహారం, విద్యను అందించలేని ఓ పేదరైతు మావోయిస్టు వర్గం వైపు ఎలా ఆకర్షితుడయ్యాడనే విషయాన్ని ప్రధానంగా రూపొందిస్తున్నారు. టీపీ అగర్వాల్, రాహుల్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం స్టార్ ఎంటర్‌టైనమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బేనరులో సమర్పిస్తున్నారు. అనంత్ మహదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గుల్షన్ గ్రోవర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. సుమారు రూ. 10 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ చిత్రంలో ఇంకా నసీరుద్దీన్ షా, వినోద్ ఖన్నా, ఆయేషా ధార్కర్, భాగ్యశ్రీ, ఆశిష్ విద్యార్ధి తదితరులు నటిస్తున్నారు.

తెలంగాణ ప్రాంతనికి సంభందించిన ఎపిసోడ్లు అక్కడ జనజీవితాన్ని పూర్తిగా ప్రతిబింబిచేటట్లు తీయాలని,అలాగే భాష కూడా అక్కడిదే వాడాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. గతంలోనూ ఇటువంటి కథతో (1979) 'మాభూమి' చిత్రం గౌతమ్ ఘోష్ తీసారు. అలాగే శ్యామ్ బెనగళ్ 'అంకుర్' సినిమా తీసి సంచలనం సృష్టించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X