»   » తెలుగు షార్ట్ ఫిల్మ్ డైరక్టర్ కు గిన్నిస్‌లో స్ధానం

తెలుగు షార్ట్ ఫిల్మ్ డైరక్టర్ కు గిన్నిస్‌లో స్ధానం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన షార్ట్ ఫిల్మ్ ల డైరక్టర్ , నిర్మాత రాజేంద్ర వినోద్‌కు గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ ప్రతినిధుల నుంచి వినోద్‌కు సమాచారం అందింది.

Hindupur youth creates record with short films, documentary

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శిల్పకళారామంగా పేరొందిన లేపాక్షి డాక్యుమెంటరీ, ఫిలాసఫీకి సంబంధించి చిత్రీకరించిన ఛేంజ్ అనే లఘుచిత్రానికి గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కినట్లు వినోద్ చెప్పారు. ఇప్పటి వరకు పయనం, ఎగ్జామ్, ఓవర్ రియాక్షన్, ఫీవర్, యాజ్ ఫర్ యాజ్ తదితర తొమ్మిది లఘుచిత్రాలను నిర్మించినట్లు రాజేంద్ర వినోద్ తెలిపారు.

ఆ షార్ట్ ఫిల్మ్ ను మీరు ఇక్కడ చూడవచ్చు....

పట్టణానికి చెందిన రైల్వేఉద్యోగి రాజేంద్రనాయుడు, వాణి రాజేంద్రల కుమారుడైన రాజేంద్ర వినోద్ స్థానిక బిట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో బిటెక్ పూర్తి చేశాడు. ఎంఎస్సీ సైకాలజీ, ఎంఏ జర్నలిజం, ఎంఎస్ మల్టీమీడియా కోర్సులు పూర్తి చేశాడు.

Hindupur youth creates record with short films, documentary

చిన్నతనం నుండి చిత్రాలపై ఆసక్తి పెంచుకున్న రాజేంద్ర తొలుత లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు నిర్మించడంలో సఫలీకృతుడయ్యాడు. రాజేంద్ర తీసిన పలు లఘుచిత్రాలకు వివిధ సంస్థలు అవార్డులు, రివార్డులు ప్రకటించాయి.

ప్రస్తుతం రాజేంద్ర కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. పలు సామాజిక అంశాలపై నూతన లఘుచిత్రాలు తీసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వినోద్ చెప్పారు. వినోద్‌కు గిన్నిస్‌లో చోటు దక్కడం పట్ల పురం వాసులు అభినందిస్తున్నారు.

English summary
A 24-year-old youth from Hindupur secured his place in the Guinness Book of World Records with his short films and documentaries.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu