»   » కేసీఆర్ మీకు ధన్యవాదాలు: నందమూరి బాలకృష్ణ

కేసీఆర్ మీకు ధన్యవాదాలు: నందమూరి బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో బాలకృష్ణ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు చెప్పారు. ఇది నిజమే పాలిటిక్స్ పద్దతిలో వెటకారంగా కాదు. కేన్సర్ వ్యాధిగ్రస్తులకు బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రి అందిస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వానికి ఆస్పత్రి చెల్లించాల్సిన రుసుమును మాఫీ చేసారు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్...

అందుకే ఈ ధన్యవాదాలు. బుదవారం రోజున బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రి 16 వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటైన కార్యక్రమం లో ఆసుపత్రి చైర్మన్ గా ఉన్న బాలకృష్ణ హాజరయ్యారు. కేక్ ని కట్ చేసాక. హాస్పిటల్ లో చికిత్సపొంది క్యాన్సర్ నుండి విముక్తులైన వారిని పలకరించి వారిని సత్కరించారు. క్యాన్సర్ ని ప్రాణాంతక వ్యాదులనుంచి తొలగించే రోజుకోసం ఎదురు చూస్తున్నామనీ అప్పటిదాకా తనవంతు పోరాటం చేస్తూనే ఉంటాననీ చెప్పారు బాలకృష్ణ.

balayya

కుల, మత, ప్రాంత తారతమ్యం లేకుండా అందరికీ అంతర్జాతీయస్థాయి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రీడల్లో విజేతలకు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు బహుమతులు అందజేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సీఈవో ఆర్‌పీ సింగ్, ట్రస్ట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, ఎంవీఎస్‌ఎస్ మూర్తి, జేఎస్‌ఆర్ ప్రసాద్, మెడికల్ డెరైక్టర్ టీఎస్ రావు, మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

English summary
Hinduupuram MLA, Tollywood Hero Nandamuri Balakrishna says thanks to Telangana CM kalvakunTla chandrashekhar rao. for Cancelation of Tax on Basavatarakam Indo American Cancer Hospital yester Day...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu