»   » వసూళ్ల కోసం రికార్డు స్థాయిలో పేయిడ్ ప్రివ్యూస్

వసూళ్ల కోసం రికార్డు స్థాయిలో పేయిడ్ ప్రివ్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రం ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ చరిత్రలో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టయేందుకు, భారీ వసూళ్లు సాధించేందుకు నిర్మాతలు తమ శక్తిమేర ప్రయత్నిస్తున్నారట. ఓపెనింగ్స్ బాగా రాబట్టేందుకు రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేయడంతో పాటు, బాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేయిడ్ ప్రివ్యూషోలు వేసారట.

అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ 3 ఇడియట్స్ పేరుతో ఉన్న రూ. 202 కోట్ల రికార్డు.....'చెన్నై ఎక్స్‌ప్రెస్' దెబ్బతో బద్దలు అవుతుందని, అందుకు తగిన విధంగా, భారీ వసూళ్లు సాధించే విధంగా పకడ్భంధీ ఏర్పాట్లు చేసారని అంటున్నారు. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందనేది రేపు విడుదలైన తర్వాత తేలనుంది.

షారుక్ ఖాన్‌, దీపిక పడుకొనె హీరో హీరోయిన్లుగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో 'చెన్నై ఎక్స్‌ప్రెస్' తెరకెక్కింది. ఈద్ పండుగను పురస్కరించుకుని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ముంబై నుంచి రామేశ్వరం వరకు ప్రయాణం చేసిన చిత్ర కథానాయకుడికి ఎదురైన అనుభవాలతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

ఇప్పటికే 'చెన్నై ఎక్స్‌ప్రెస్' శాటిలైట్ హక్కులు ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడుపోయిన్లు తెలుస్తోంది. ఇక బాక్సాఫీసు వద్ద సినిమా ఏ రేంజిలో హిట్టవుతుందో చూడాలి. మరో విషయం ఏమిటంటే ఈచిత్రంలో సైతిండియా సినిమా మాసాలాను బాగా ఉపయోగించారు. ఇప్పటికే విడుదలై ఈచిత్రం ట్రైలర్ చూస్తుంటే పలు దక్షిణాది చిత్రాలతో పాటు, తెలుగు సినిమాలైన ఒక్కడు, నరసింహ నాయుడు, అంత:పురం, మర్యాద రామన్న లాంటి చిత్రాల్లోని సీన్లను దర్శకుడు రోహిత్ అనుసరించినట్లు స్పష్టం అవుతోంది.

English summary
Ripples of excitement over this year’s Eid release, Chennai Express, have turned into a tidal wave. Advance booking for the paid preview shows is already house full and the film is expected to earn the highest-ever returns for paid previews for any film so far.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu