»   » సెల్ఫీకి ఎన్ని లైకులోస్తాయ్?: చెప్పండి బ్రదర్

సెల్ఫీకి ఎన్ని లైకులోస్తాయ్?: చెప్పండి బ్రదర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ అల్లరి హీరో నరేష్ మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు వచ్చేసాడు.సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమా డైరక్టర్ ఈశ్వర్ రెడ్డి డైరక్షన్ లో రూపుదిద్దుకున్న సినిమా సెల్ఫీ రాజా. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ జయంతి సంద‌ర్భంగా అల్ల‌రి న‌రేష్ హీరోగా సుంక‌ర రామ‌బ్ర‌హ్మం స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.కె.ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వచ్చిన హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ 'సెల్ఫీరాజా'.

సినిమా టైటిల్ నుండి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే విడుద‌ల‌కు ముందు టూర్ లో విడుద‌ల చేసిన సాంగ్స్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కు ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. నరేష్ నుండి ఎలాంటి కామెడి కావాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి కామెడితో నరేష్ నవ్వించడానికి


సెల్ఫీ తీసుకోవాలనే క్షణికానందం కోసం కొందరు ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. ఇంతకు ముందు స్టార్లు కనిపిస్తే ఆటోగ్రాఫ్‌లు తీసుకునేవారు. కానీ ఇప్పుడు అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. మరి ఈసినిమాలో సంధర్బం ఏదనా సరే సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియా లో పెట్టటం బలహీనత గా మారిన వ్యక్తి గా కనిపించనున్న అల్లరి నరేష్ ఏ మేరకు సక్సెస్ సాధించాడూ అనే విశయం మరికొద్ది సేపట్లో తేలనుంది.


Hit or Flop Allari Naresh's Selfy Raja

ఈ చిత్రానికి యంగ్ హీరో శ‌ర్వానంద్ వాయిస్ ఓవ‌ర్ అందిస్తుండ‌టం విశేషం. ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగే శ‌ర్వానంద్ వాయిస్ ఓవ‌ర్ సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని చిత్ర‌యూనిట్ భావిస్తుంది. గ‌మ్యం వంటి బెంచ్ మార్క్ మూవీతో పాటు, నువ్వా నేనా అనే ఎంట‌ర్ టైనింగ్ మూవీలో శ‌ర్వానంద్‌, అల్ల‌రి న‌రేష్‌ల కాంబినేష‌న్ స‌క్సెస్ అయ్యింది. సెల్ఫీరాజా చిత్రానికి వాయిస్ అందించ‌డం ద్వారా వీరు మూడోసారి క‌లిసి ప‌ని చేస్తున్న‌ట్ట‌య్యింది.


చాలా కాలం గా సరైన హిట్ లేని అల్లరి నరేష్ ఈ సినిమాతో ఖచితంగా ఇంకో హిట్ గ్యారెంటీ నన్న కాఫిడెన్స్ తో ఉన్నాడు. ఇప్పటికే వచ్చిన వివరాల ప్రకారం సినిమా యావరేజ్ గా నిలవనుందనే తెలుసుస్తోంది. మరో రెండు వారాల్లో జనతా గ్యారేజ్, బాబు బంగారం, కబాలి వంటి సినిమాలు వచ్చే లోపులో సెల్ఫీ రాజా తనని తాను ఎంతవరకూ నిలబెట్టుకుంటాడన్నదే ప్రశ్న....

English summary
Star comedy hero Allari Naresh, who has given many hit movies in last few years came up with a new one named “Selfie Raja” released on 15th of July. This movie has a special attraction with Sarwanand vioeceover.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu