»   »  పెద్ద స్కెచ్ తోనే ఎన్టీఆర్, నెవర్ బిఫోర్ అన్నట్లుగా...

పెద్ద స్కెచ్ తోనే ఎన్టీఆర్, నెవర్ బిఫోర్ అన్నట్లుగా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ హీరోగా బాబి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సీకే మురళీధరన్‌ను ఇటీవల ఎంపిక చేశారు.

Hollywood make-up artist roped in for NTRs next

అలాగే 'లార్డ్‌ ఆఫ్‌ రింగ్స్‌', 'ఐరన్‌ మ్యాన్‌', 'లైఫ్‌ ఆఫ్‌ పై', 'రోబో' వంటి చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్‌ ప్రముఖ ప్రోస్ధటిక్స్‌, సాంకేతిక నిపుణుడు వాన్స్‌ హార్ట్వెల్‌ ఈచిత్రానికి పనిచేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. వాన్స్‌ హార్ట్వెల్‌తో ఎన్టీఆర్‌ దిగిన ఫొటోను పోస్ట్‌ చేసింది.


ఇక ఈ నెల 15నుంచి యంగ్ టైగర్ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కువగా వర్కవుట్స్ చేస్తూ.. సన్నబడేందుకు బాగా కష్టపడుతున్నట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. మూడు పాత్రల్లో మూడు రకాల వేరియేషన్స్‌ చూపించాలి అని. అందుకే ఓ పాత్ర కోసం ప్రత్యేకంగా బరువు తగ్గుతున్నాడని చెప్పుకుంటున్నారు. అందుకోసం జిమ్‌లో కసరత్తులు మొదలెట్టేశాడట

ఎన్టీఆర్‌ తన కెరీర్‌లో తొలిసారిగా ఇందులో త్రిపాత్రాభినయం చేయనున్నారు. రాశీఖన్నా ఈ చిత్రంలో ఓ హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. 'జై.. లవ కుశ..' అనే టైటిల్‌ను ఈ చిత్రానికి పరిశీలిస్తున్నట్లు సమాచారం.

English summary
Well known international make-up artist Vance Hartwell, popular for his work in films such as "The Lord of the Rings" trilogy and "Shutter Island", has been roped in by the makers of actor NTR's next yet-untitled Telugu movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu