»   »  కాపీ 'హోమం' ఫలించలేదు...

కాపీ 'హోమం' ఫలించలేదు...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Homam
జె.డి చక్రవర్తి తెలుగులో మొదటసారి దర్శకత్వం చేస్తూ నటించిన హోమం చిత్రం ఎవరికీ నచ్చటంలేదని ప్రాధమిక సమాచారం. ఆస్కార్ విన్నింగ్ హాలివుడ్ సినిమా డిపార్టెడ్ ఫ్రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో స్పష్టత లోపించింటం పెద్ద సమస్యగా మారి ప్రేక్షకులకు సహమ పరీక్ష పెడుతోంది. ఈ సినిమా ముఖ్యంగా దొంగ-పోలీస్ ఆటగా ట్విస్ట్ లతో సాగుతుంది. పోలీసులు తమ మనిషిని మాఫియా లో పెడతారు. అలాగే మాఫియా వ్యక్తులు పోలీసుల్లో తమ మనిషిని పెట్టి మేటర్స్ లీక్ చేయ ప్రయత్నిస్తూంటారు. వీళ్ళిద్దరూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళుండి ఎలా బయట పడకుండా తమ పనులను నెరవేర్చుకున్నారనేది స్టోరీలైను.ఇక ఈ చిత్రంలో ఒరిజనల్ లో లేని కలిపిన తల్లి సెంటిమెంటు,లవ్ సీన్లు విడిగా కథలో కలవకుండా మిగిలిపోయాయి. ఇక జగపతిబాబు,మహేష్ ముంజ్రేకర్ లు మంచి నటన కనిపిచారు. పబ్లిసిటీ చేసినంతగా మమతా మోహనదాస్ సాంగ్ లో కిక్కు లేదు.

గతంలోనూ మద్యాహ్నం హత్య, సూరి వంటి చిత్రాలకు గోస్ట్ దర్శకత్వం వహించి హిందీలో దర్వాజా బంద్ రఖో,దుర్గా వంటి చిత్రాలను డైరక్ట్ చేసాడు. అయితే తన గురువు రామ్ గోపాల్ వర్మ ను అనుకరిస్తూ సన్నివేశాలు,రీ రికార్డింగ్ సినిమాలో చోటు చేసుకోవటం సృజనాత్మక వైఫల్యమే అని విశ్లేషకులు అంటూంటారు. ఇక డిరార్టెడ్ ...ఇంటర్నెల్ ఎఫైర్స్ అనే సినిమాకి రీమేక్ కావటం..దాన్ని జెరాక్స్ కాపీలా జెడీ ఫ్రీ మేక్ చేయటంతో అతని ప్రతిభను పెద్దగా లెక్కించటానికి అవకాశంలేదు. మరి చిరవలో మారణహోమం అనే సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు. అంటే అక్కడ ఇంటర్నెల్ ఎఫైర్స్ మూడు పార్ట్ లుగా వచ్చింది. అవన్నీ తీసి మనమీదకి విసురుతాడా అని అందరూ ఆలోచనలో పడుతున్నారురు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X