»   » తమన్నా డాక్టర్ అయ్యింది.... సినిమాలో కాదు నిజంగా ఇప్పుడు డాక్టర్ తమన్నా

తమన్నా డాక్టర్ అయ్యింది.... సినిమాలో కాదు నిజంగా ఇప్పుడు డాక్టర్ తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలితో తమన్నా రేంజ్ మారిపోయింది. టీన్ ఏజ్‌లోనే సినీ కెరీర్ ప్రారంభించిన తమన్నా కొన్ని ఇష్టాయిష్టాలను వదిలేసుకుంది. స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగాక.. కొన్ని పనులు చేద్దామనుకున్నా అవి కుదరవు. మిల్కీ బ్యూటీగా సౌత్ లోనే కాదు... బాహుబలితో బాలీవుడ్‌లోనూ బాగా పాపులర్ అయిన తమన్నా ఇప్పుడు డాక్టర్ కూడా అయ్యింది. ఇన్నేళ్ళ కెరియర్ లో తమన్నా కొన్ని కోట్ల మంది అభిమానులను తన నటనకు గుర్తింపుని స్టార్ హీరోయిన్ అనే స్టేటస్ ని సంపాదించిన తరువాత ఆమెకు ఒకNGO రూపంలో అరుదైన గౌరవం దక్కింది.

తమన్నాను గౌరవ డాక్టరేట్ వరించింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో నటనలో ఆమె కనబర్చిన నైపుణ్యాన్ని గుర్తించిన 'కాన్ఫిడెరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ కమీషన్' అనే గుజరాత్ కి చెందిన సంస్థ డాక్టరేట్ తో సత్కరించింది. ఈనెల 22 న అహ్మదాబాద్ లో ఆమెకు ఈ సత్కారం జరిగింది. ఈవిషయాన్ని తమన్నా తన పేస్ బుక్ ద్వారా తెలియజేస్తూ 'డాక్టరేట్ రావడం సంతోషాన్నిచ్చిందని, ఈ గౌరవం తన భాద్యతను మరింత పెంచిందని, ఆ గౌరవాన్ని కాపాడుకుంటానని' తెలిపింది.

Honorable Doctorate To Actress Tamanna

సాధారణగా డాక్టరేట్ కావాలి అంటే దేనిలోనైనా రిసర్చ్ చేయాలి లేదంటే ఏదైనా ఒక కళపై గాని సమాజ శ్రేయస్సు కోసం గాని పాటుపడితే వాళ్ళకి డాక్టరేట్ ఇస్తారు. ఇప్పుడు అలానే తమన్నా సౌత్ సినిమాకు చేసిన కంట్రిబ్యూషన్ గాను CIAC అనే ఒక ఎన్జీయో సంస్థ డాక్టరేట్ ఇచ్చింది. తమిళనాడు కలైమని అవార్డ్ - ఆసియా విజన్ అవార్డ్ - ఆసియనేట్ ఫిల్మ్ అవార్డ్ - సౌత్ స్కోప్ అవార్డ్ లుSIIMA అవార్డ్, 2017 దయవతి మోదీ అవార్డ్, ఇంకా ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ నామినేషన్ అయిన తమన్నా ఇప్పుడు డాక్టరేట్ తో డాక్టర్ కాబోతుంది.

Pragya Jaiswal Kicked Sandeep kishan hardly in practice | Filmibeat Telugu
English summary
An International NGO has conferred Tamanna with an Honorary Doctorate. Tamanna said that she will strive to do justice to the honor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu