»   » రాశి ఖన్నా కు జర్నీలో ...చేదు అనుభవం

రాశి ఖన్నా కు జర్నీలో ...చేదు అనుభవం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ‘మనం' చిత్రంలో అతిధి పాత్రలో మెరిసి.. ‘ఊహలు గుసగుసలాడే' చిత్రంతో చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ముంబై ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఈమె కు నిన్న ఓ చేదు అనుభవం కలిగింది. ఓ పీడకల లాంటి అనుభవం అని ఆమె పేర్కొంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వివరాల్లోకి వెళితే...రాశి ఖన్నా... లాట్ మొబైల్స్ వారి షాపు ఓపినింగ్ కు హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తోంది. ఆమె రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో దిగి అక్కడ నుంచి వెల్లటానకి ట్రిప్ ప్లాన్ చేసుకుంది. రేణిగుంట నుంచి ఆమె ను పికప్ చేసుకోవటానికి షాప్ ఓనర్స్ ...కారు ఎరేంజ్ చేసారు. అయితే కారు డ్రైవర్ కన్ఫూజ్ అయ్యి..దారి మరిచి రాంగ్ డైరక్షన్ లో వెళ్లాడు. దాంతో షాపు ఇనాగరేషన్ లేట్ అయ్యింది.

అంతే కాదు..రాశి ఖన్నా మిస్సైందంటూ లోకల్ మీడియాకు లీక్ అయ్యి వార్త వచ్చేసింది. ఎంతలా షాప్ ఓనర్స్ దాచుదామని ప్రయత్నించినా కుదరలేదు. 11:45 కు ఆమె రావాల్సి ఉండగా... రెండు గంటలకు ఆమె షాపు వద్దకు చేరుకుంది. రెండు గంటలు పాటు లేటు కావటంతో అందరూ షాక్ అయ్యారు. అయితే...ఆమె వచ్చిన తర్వాత అంతా పెద్దగా నిట్టూర్చి రిలీఫ్ అయ్యారు.

Horrible experience for Raashi Khanna

బాలీవుడ్ మూవీ మద్రాస్ కేఫ్ తో మురిపించి.. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు జనాలను మైమరపించిన క్యూట్ బ్యూటీ రాశి ఖన్నా. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు హాట్ బ్యూటీ రాశి ఖన్నా.... ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు.. అంత ఈజీగా ఆఫర్లు రాలేదనే చెప్పాలి.... సందీప్ కిషన్ వంటి అప్ కమింగ్ హీరోతో కలిసి నటించిన జోరు సినిమా రాశి ఖన్నాకు నిరాశనే మిగిల్చింది.

దీంతో రవితేజ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ తో తెరకెక్కుతున్న బెంగాల్ టైగర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించేందుకు కమిటైంది ఈ అందాల రాశి....అయితే గోపిచంద్ సరసన నటించిన జిల్ మూవీపై రాశి ఖన్నా ఎన్నో హోప్స్ పెట్టుకుంది. వాటిని చాలా వవరూ ఈ చిత్రం తీర్చిందనే చెప్పాలి.

జిల్ సినిమా రిలీజ్ కాకముందే రాశి ఖన్నాకు కొన్ని ఆఫర్లు వచ్చినా.. వాటిని అస్సలు ఒప్పుకోలేదట ఈ ముద్దుగుమ్మ... జిల్ సినిమాతో తనకు హిట్ రావడం ఖాయమనే ఫీలింగ్ లో ఉన్న ఈ అప్ కమింగ్ బ్యూటీ.. సినిమా రిలీజైన తరువాతే కొత్త సినిమాకు కమిటవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యి...ఇప్పుడు వరస సినిమాలు పట్టుకుంటోంది.

Horrible experience for Raashi Khanna

జిల్ సక్సెస్ సాధిస్తే.. తనకు క్రేజీ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తాయని.. రెమ్యూనరేషన్ కూడా పెంచేయొచ్చని ప్లాన్ చేసిందట రాశి ఖన్నాకు అంతలా ఆశలు నెరవేరలేదనే చెప్పాలి. జిల్ ఆడియో ఫంక్షన్ లోనే జిగేల్ మనిపించే డ్రస్సులో కేక పుట్టించిన రాశీ.. సినిమాలోనూ తన సెక్సీ ఫిగర్ తో స్ర్కీన్ ను షేక్ చేసింది. సాంగ్స్ లోనూ సూపర్బ్ స్కిన్ షోతో ఏసీ సినిమా హాళ్లలోనూ ఉక్కపోత పెంచిన ఈ బ్యూటీ అంతలోనే ఇంత గ్లామర్ క్వీన్ లా మేకోవర్ కావడానికి కారణం తెలిసింది. రాశి ఖన్నా పర్ ఫెక్ట్ ఫిగర్ కు ఆమె తీసుకుంటున్న డైటే కారణమట.

డార్క్ చాక్లెట్స్ అంటే ప్రాణం తీసుకునే ఈ ఢిల్లీ పాప.. స్లిమ్ బాడీ, కర్వ్ లుక్స్ కోసం వాటిని కూడా పక్కన పెట్టేసిందట. నోటికి తాళం వేయడం వల్లే.. జిల్ సినిమాలో అమ్మడి లుక్ అంతలా మ్యాజిక్ చేసిందట. మరి జిల్ మూవీలో టోటల్ ఛేంజ్ చూపించిన ఈ బ్యూటీఫుల్ గాళ్.. ప్రస్తుతం రవితేజ బెంగాల్ టైగర్ మూవీలో నటిస్తోంది.

English summary
Raashi Khanna had a terrible nightmare of sorts in the daytime when the driver of the car she was travelling from Reni Gunta to Nellore, took a different route to reach Nellore.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu