»   » ఉయ్యాలవాడ కోసం గుర్రాలకు చిరంజీవి పూజలు?? : రామ్‌చరణ్ ఫామ్ హౌస్ లోనే

ఉయ్యాలవాడ కోసం గుర్రాలకు చిరంజీవి పూజలు?? : రామ్‌చరణ్ ఫామ్ హౌస్ లోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి సినిమాల్లో ఒకప్పుడు గుర్రాలుంటే ఆ సినిమా రేంజే వేరుగా ఉండేది. కొండవీటి దొంగ, అడవి దొంగ, జగదేక వీరుడూ అతిలోక సుందరీ... ఇలా చిరు గుర్రం ఎక్కిన ప్రతీసినిమా సూపర్ హిట్ అయిపోవాల్సిందే. ఆ రోజుల్లో ఆ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయ్యింది కానీ. మధ్యలో ఏమయ్యిందోగానీ గుర్రాల సెంటిమెంట్ తిరగబడింది.

సినిమా కూడా గుర్రమెక్కినట్టే

సినిమా కూడా గుర్రమెక్కినట్టే

తర్వాత ఏ సినిమాలో చిరూ గుర్రమెక్కినా ఆ సినిమా కూడా గుర్రమెక్కినట్టే... అంజి మూవీ ఫ్లాప్.. రీసెంట్ గా బ్రూస్ లీలో కూడా గుర్రం కలిసిరాలేదు. అందుకే గుర్రాలని అవాయిడ్ చేద్దామనుకున్నారట. అయితే ఇప్పుడు వస్తున్న సినిమా ఉయ్యాలవాద నరసిమ్హారెడ్డి కోసం తప్పని సరిగ గుర్రం వాడాల్సిందే కాబట్టి ఇప్పుడేం చేయాలా అని ఆలోచించి. పూజలు మొదలు పెట్టారట.

200 ఏళ్ల క్రితం చరిత్ర

200 ఏళ్ల క్రితం చరిత్ర

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ అంటే. బైకులూ కార్లూ ఉండవు.200 ఏళ్ల క్రితం చరిత్రను చూపాలి. అప్పటి బ్రిటిష్ రాజ్యంతో పోరాటాన్ని చూపాలి. దీనిలో భాగంగా గుర్రాలు.. రాజ్యాలు.. కత్తులు.. బరిసెలు.. డబుల్ బ్యారెల్ గన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ సరే గానీ గుర్రాలతో పెద్ద చిక్కొచ్చి పడింది అందుకే ఆ సెంటిమెంట్ కోసం దోశనివారణ చేపట్టారట.

 గుర్రం కలిసిరాలేదు

గుర్రం కలిసిరాలేదు

ఎంతో కష్టపడ్డ అంజి మూవీ ఫ్లాప్.. రీసెంట్ గా బ్రూస్ లీలో కూడా గుర్రం కలిసిరాలేదు. అసలు గుర్రాల చుట్టూనే తిరిగే అబు-బాగ్దాద్ గజదొంగ ఏమైందో తెలీదు. అసలే భక్తి.. సెంటిమెంట్స్ విషయంలో బాగా కేర్ తీసుకునే చిరంజీవి.. ఇప్పుడు గుర్రాలకు శాంతి పూజలు చేయించనున్నారట. అది కూడా రామ్ చరణ్ కు చెందిన ఫామ్ హౌస్ లోని గుర్రాలకే కావడం విశేషం.

ఆ హిట్ ని నిలబెట్టుకోవాలి

ఆ హిట్ ని నిలబెట్టుకోవాలి

'ఖైదీ నంబర్ 150'తో బిగ్ హిట్ సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు రెండో సినిమా తో కూడా ఆ హిట్ ని నిలబెట్టుకోవాలి లేదంటే 150 కి వచ్చిన క్రేజ్ కేవలం 10ఏళ్ళ తర్వాత వచ్చిన బూమ్ అన్న మాట వచ్చేస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి" హిట్ అయ్యి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే ఏచిన్న కారణాన్ని కూడా లైట్ తీస్కోవటానికి ఇష్టపడటం లేదు.

English summary
We have seen both Ram Charan and Chiranjeevi riding horse in Bruce lee and Anji. But the movies resulted in disaster. To clear all the disastrous things that followed him earlier, Chiranjeevi to set up a pooja ritual to the horses that he is going to ride at Ram charan’s Farm House, Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu