»   » హాట్ టాపిక్: శ్రీదేవికి జాతీయ ఉత్తమ నటి అవార్డ్ ఇవ్వడంపై రచ్చ రచ్చ!

హాట్ టాపిక్: శ్రీదేవికి జాతీయ ఉత్తమ నటి అవార్డ్ ఇవ్వడంపై రచ్చ రచ్చ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

65వ జాతీయ సినీ అవార్డుల్లో ప్రముఖ నటి, దివంగత అతిలోక సుందరి శ్రీదేవి ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైంది. 'మామ్' చిత్రంలో నటనకుగాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. శ్రీదేవి తన కెరీర్లో అందుకున్న తొలి జాతీయ ఉత్తమ నటి అవార్డు ఇదే కావడం విశేషం. తమ అభిమాన నటికి అవార్డు దక్కడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.... కొందరు కేవలం ఆమె చనిపోయిందనే సింపథీతో ఈ అవార్డుకు ఎంపిక చేశారని అంటున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

65th National Film Awards Announcement,Sridevi Got Best Actress
ఆ సినిమాలతో పోలిస్తే....

ఆ సినిమాలతో పోలిస్తే....

‘మామ్' చిత్రంలో శ్రీదేవి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారనే విషయం ఎవరూ కాదనలేనిది, అయితే అది ఆమె కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కాదు అని కొందరు వాదిస్తున్నారు. ఆమె తన కెరీర్లో సద్మా, గుమ్రా, ఇంగ్లిష్ వింగ్లిష్ లాంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. ‘మామ్' చిత్రం కంటే సద్మా, ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రాల్లో శ్రీదేవి పెర్ఫార్మెన్స్‌ ఇంకా ఎంతో అద్బుతంగా ఉంటుందని వాదిస్తున్నారు.

 శ్రీదేవి అవార్డుపై వాదనలు

శ్రీదేవి అవార్డుపై వాదనలు

శ్రీదేవి తన సుధీర్ఘ సినీ కెరీర్లో దక్షిణాది సినీ పరిశ్రమలో పాటు హిందీ, ఇతర భాషల్లో కలిపి వందల చిత్రాల్లో నటించారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఆమె జీవించి ఉన్న రోజుల్లో ఒక్కసారి కూడా జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కక పోవడం గమనార్హం.

 అందుకే ఆమెను ఎంపిక చేశారా?

అందుకే ఆమెను ఎంపిక చేశారా?

జాతీయ సినీ అవార్డుల జ్యూరి కమిటీ శ్రీదేవి ట్రాక్ రికార్డు, ఆమెకు ఉన్న అభిమానులు, పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ఆమె చనిపోయిందనే సింపథీతో ‘మామ్' చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటిగా ఎంపిక చేసినట్లు కొందరు భావిస్తున్నారు.

మోతెక్కిపోతున్న ట్విట్టర్

శీదేవి అవార్డుకు సంబంధించిన టాపిక్‌తో ట్విట్టర్ మోతెక్కిపోతోంది.

English summary
Sridevi has won her first ever National Award for her performance in Mom. However, many seem to believe that her death prompted the jury panel to confer her with the national award as the celebrated actress never won one when she was alive even after several remarkable performances.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X