»   » ఇలియానాకు ఇష్టమైన ఆ రెండూ

ఇలియానాకు ఇష్టమైన ఆ రెండూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇలియానా ఖాళీ సమయాల్లో,షూటింగ్ గ్యాప్ లలో ఏం చేస్తూంటుంది. అంటే ఆమెకు ఇష్టమైన రెండు హ్యాబిట్ ల గురించి చెప్పుకొచ్చింది. అవి మరేమో కాదు..ఒకటి పెయింటింగ్‌, రెండోది బుక్ రీడింగ్. షూటింగ్ గ్యాప్ లో ఖాళీ దొరికితే ఆమె పుస్తకాలు పుచ్చుకు కూర్చుంటుంది. ప్రముఖ రచయిత సిడ్నీ షెల్టర్‌ రచనలంటే ఆమెకు ప్రాణం. ఎప్పుడూ ఆమె బ్యాగ్ లో, చేతిలో షిడ్నీ షెల్టర్‌ నవల తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే.నాన్‌ ఫిక్షన్‌ రచనలకే తన ఓటని,ఫిక్షన్‌ రచనలంటే ఆసక్తి లేదంటోంది. ఇక పెయింటింగ్ గురించి చెబుతూ..ఇంటి దగ్గర తను వేసిన పెయింటింగ్ లు చాలా ఉన్నాయంటోంది. అలా బొమ్మలు వేయటం మనస్సును తేలికపరుస్తుంది అంటోంది. ఓ ప్రక్క యాక్టింగ్,మరో ప్రక్క పెయింటింగ్, ఖాళీ దొరికితే బుక్ రీడింగ్...బాగుంది కదూ ఇలియానా లైఫ్ స్టెయిల్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu